Begin typing your search above and press return to search.

డాక్టర్ల పై దాడికి నిరసనగా..23న బ్లాక్ డే పాటిస్తామంటున్న డాక్టర్లు!

By:  Tupaki Desk   |   21 April 2020 1:00 PM GMT
డాక్టర్ల పై దాడికి నిరసనగా..23న బ్లాక్ డే పాటిస్తామంటున్న డాక్టర్లు!
X
ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే వైద్యులు ఇప్పుడు కన్నెర్ర చేస్టున్నారు. కంటికి కనిపించని కరోనా వైరస్ బారిన పడి ప్రాణాపాయంలో ఉన్న వారిని ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. వైద్యం చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు సహజంగా జరిగిపోతుంటాయని, ఆ మాత్రానికే డాక్టర్ల పై బౌతిక దాడులకి దిగడం సమంజసం కాదని అంటున్నారు. ప్రాణాలు కాపాడిన డాక్టర్ ను దేవుడుతో పోలుస్తారని .. అయితే , ఎదో ఒక సమయంలో రోగులకు జరగకూడనిది జరిగిపోయినంత మాత్రాన డాక్టర్లని విలన్లుగా చూడటం ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించాలి అని కోరుతున్నారు.

ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి సోకకుండా వైద్యం అందిస్తున్న సమయంలో రోగులు చేస్తున్న దాడులకు నిరసనగా బ్లాక్ డే పాటించాలని కార్యాచరణ రూపొందించుకున్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు. కరోనాపై పోరాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 23న బ్లాక్‌ డే పాటించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నిర్ణయించింది. ఈ మేరకు ఐఎంఏ గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్వీ అశోకన్‌ ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ రాజన్‌ శర్మ, ఓ ప్రకటనలో తెలిపారు.

కరోనా కట్టడికోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులపై జరుగుతున్నా దాడులకు నిరసనగా, గురువారం రోజున దేశంలోని డాక్టర్లంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని కోరారు. ఈ దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22 బుదవారం రాత్రి 9 గంటలకు ఆస్పత్రులలో క్యాండిల్స్‌ వెలిగించి నిరసన తెలపాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే ..వైద్యుల పై జరిగే దాడుల పట్ల డాక్టర్ల సంఘం ఎంత ఆగ్రహంతో ఉందొ అర్ధమవుతోంది.