Begin typing your search above and press return to search.
వైద్య శాస్త్రంలో నిజంగా ఇది సంచలనమే.. స్టెమ్ సెల్స్‌తో బిడ్డ ప్రాణాలు కాపాడిన వైద్యులు!
By: Tupaki Desk | 22 Dec 2022 10:50 AM GMTవైద్య శాస్త్రంలో తాజా పరిశోధనలు మనిషి జీవన ప్రమాణాన్ని పెంచనున్నాయి. ఈ దిశగా వైద్యులు సాగిస్తున్న పరిశోధనలు మనిషికి వెలుగు చూపిస్తున్నాయి. తాజాగా తల్లి గర్భంలోని ప్లాసెంటా నుంచి సేకరించిన మూలకణాల (స్టెమ్‌సెల్స్) సాయంతో ప్రపంచంలోని తొలిసారి ఒక బిడ్డ ప్రాణాలు కాపాడగలగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. వైద్య శాస్త్రంలో ఇదో అరుదైన సందర్భమని చెబుతున్నారు.
బ్రిస్టల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ మాసిమో క్యాపులో ఒక చిన్నారి గుండెలో లోపం ఉన్నట్టు నిర్ధారించారు. పుట్టినప్పుడు గుండెలోని ప్రధాన రక్తనాళాలు ఉండాల్సిన చోటుకు బదులుగా వేరే ప్రాంతంలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ బిడ్డకు నాలుగు రోజుల వయసున్నప్పుడే బ్రిస్టల్ రాయల్ హాస్పిటల్‌లో అతడికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు.
దీన్ని సరిచేసేందుకు ఆ చిన్నారి తల్లి గర్భంలోని మూలకణాల నుంచి ఒక స్టెమ్‌సెల్ పట్టీని మాసిమో అభివృద్ధి చేశారు. ఇది మెరుగ్గా పనిచేసిందని చెప్పారు.
పుట్టుకతోనే పిల్లలకు వచ్చే గుండె జబ్బులను ఆపరేషన్లు అవసరం లేకుండానే నయం చేసేందుకు ఈ స్టెమ్‌సెల్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. గుండె లోపానికి గురయిన చిన్నారి ఫిన్లే వయసు రెండేళ్లు. స్టెమ్‌సెల్ తో చికిత్స చేయడంతో అతడు ఆరోగ్యంగా ఎదుగుతున్నాడని వైద్యులు చెప్పారు.
కాగా చిన్నారి పుట్టిన నాలుగు రోజులకు చేసిన ఆ సర్జరీ వల్ల చిన్నారి గుండె సమస్య నయం కాలేదు. దీంతో క్రమంగా గుండె పనితీరు మందగించింది. ఎడమవైపు గుండె భాగాలకు రక్త ప్రసరణ తగ్గిపోయింది. ఈ క్రమంలో రెండు వారాలపాటు ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచిన తర్వాత చిన్నారి ఫిన్లే గుండెను సంప్రదాయ విధానంలో కాపాడలేమనే వైద్యులు నిర్ధారణకొచ్చారు.
చిన్నారి పరిస్థితి రోజురోజుకు విషమంగా మారుతున్న పరిస్థితుల్లో ప్లాసెంటా బ్యాంక్‌లోని స్టెమ్‌సెల్స్‌తో కొత్త చికిత్సను వైద్యులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా తల్లి గర్బంలోంచి సేకరించిన మూలకణాలతో పట్టీని రూపొందించి నేరుగా చిన్నారి ఫిన్లే గుండెలోకి డాక్టర్ మాసిమో ఇంజెక్ట్ చేశారు. దెబ్బతిన్న రక్తనాళాలను ఇవి బాగుచేయడంలో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు.
"ఎలోజెనిక్ సెల్స్"గా పిలిచే ఈ మూలకణాలను లండన్‌లోని రాయల్ ఫ్రీ హాస్పిటల్ నిపుణులు ప్రత్యేకంగా ల్యాబ్‌లో పెంచారు. ఇలా ప్రత్యేకంగా పెంచిన లక్షల కొద్దీ కణాలను ఫిన్లే గుండె కండరాల్లోకి పంపించారు. దీంతో దెబ్బతిన్న గుండె కండరాలు చక్కగా ఎదిగాయి. దీంతో చిన్నారికి మందులు ఆపేయడంతోపాటు వెంటిలేషన్ కూడా తీసేశారు. ఐసీయూ నుంచి కూడా డిశ్చార్జ్ చేశారు.
కాగా ఈ పట్టీలపై క్లినికల్ ట్రయల్స్ మరో రెండేళ్లలో జరిగే అవకాశముందని ప్రొఫెసర్ మాసిమో తెలిపారు. పుట్టుకతోనే తీవ్రమైన గుండె సమస్యలుండే పిల్లల్లో ఈ స్టెమ్‌సెల్ పట్టీలు చక్కటి పరిష్కారం కాగలవని ఆశిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.