Begin typing your search above and press return to search.
కిర్లంపూడిలో విరమణ; బాబుకు ముద్రగడ మార్క్ షాక్
By: Tupaki Desk | 21 Jun 2016 10:02 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాయుడికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం షాకులు ఎక్కువైపోయాయి. ఒత్తిడితో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేరన్న దానికి బాబు వ్యవహారంలో ముద్రగడ ఎపిసోడ్ ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. తుని విధ్వంసం కేసులో అరెస్ట్ లు మొదలుకొని.. పోలీస్ స్టేషన్ కు వచ్చి అరెస్ట్ చేసుకోమని సవాలు విసిరిన ముద్రగడను సాదరంగా తీసుకెళ్లి ఇంటి వద్ద విడిచి పెట్టటం.. దీక్షతో హడావుడి చేస్తున్న ఆయన్ను.. జాగ్రత్తగా రాజమహేంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 14 రోజులు దీక్ష చేసినా.. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూశారు. ఆయన డిమాండ్లకు తగ్గట్లే తుని విధ్వంసంలో నిందితులకు బెయిల్ ఇప్పించి.. ముద్రగడ కోరుకున్నట్లగా ఆసుపత్రిలో ఆయన కోరుకున్న తీరులోనే ఆయన ముందుకు తీసుకెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్ మొత్తంలో ఫినిషింగ్ టచ్ లోనూ ముద్రగడ మార్క్ స్పష్టంగా కనిపించటం విశేషం. తాజాగా ముద్రగడకు వైద్యం చేస్తున్న వైద్యులు మాట్లాడుతూ.. ఈ సాయంత్రం ముద్రగడ దీక్ష విరమించనున్నట్లుగా తమతో చెప్పినట్లుగా వెల్లడించారు. అంతేకాదు.. ఈ (మంగళవారం) సాయంత్రం ముద్రగడను కిర్లంపూడికి తరలిస్తామని.. ఆయన నివాసంలో దీక్ష విరమించాలని ముద్రగడ భావిస్తున్నట్లుగా వారు చెబుతున్నారు. అయితే.. దీక్ష విమరణ.. ఎక్కడ విరమించే అంశంపై ముద్రగడ తరఫున ఎలాంటి ప్రకటన రాకపోవటం గమనార్హం.
తాజా ఉదంతాన్ని చూస్తే.. ముద్రగడ అనుమతి లేకుండా ఆయన దీక్ష విరమణను వెల్లడించే అవకాశం లేదు. అదే సమయంలో.. ప్రభుత్వం సైతం చెప్పలేని ఇబ్బందికర పరిస్థితి. అందుకే.. మధ్యే మార్గంగా వైద్యుల ద్వారా చెప్పించటం మంచిదన్న ఉద్దేశంతో వారి చేత ప్రకటన ఇప్పించి ఉంటారన్న మాట వినిపిస్తోంది. మొత్తమ్మీదా తాను కోరుకున్న విధంగానే అరెస్ట్ అయిన 13 మందికి బెయిల్ ఇప్పించటమే కాదు.. 14 రోజులుగా చేస్తున్న దీక్షను ఆసుపత్రిలో కాకుండా.. తన అడ్డా అయిన కిర్లంపూడిలో తన స్వగృహంలో విరమించటానికి మించిన షాక్ ఏపీ సర్కారుకు ఇంకేం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.