Begin typing your search above and press return to search.
శవాల మీద పేలాలు ఏరుకునేటోళ్లు మన చుట్టునే ఉన్నారా?
By: Tupaki Desk | 24 March 2020 2:30 AM GMTమంటల్లో పడి మాడి మసి అయిపోతున్నా.. సరే కొందరు ఆ మసితో వ్యాపారం చేసి.. నాలుగు రాళ్లు ఎలా వెనకేసుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచనలు చేస్తుంటారు. ప్రజల్లో భయాన్ని సొమ్ము చేసుకోవటానికి కొందరి బరితెగింపు చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. ఎలాంటి మొహమాటం లేకుండా.. వారు ప్రవర్తించే తీరు ఎంత పచ్చిగా ఉంటుందో ఈ బోర్డుల్ని చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంటుంది.
ఓపక్క కరోనాకు మందుల్లేక కిందా మీదా పడుతూ వేలాదిగా చస్తూ.. లక్షలాదిగా దాని బారిన పడి నరకయాతన పడుతున్నారు. మరోవైపు మాత్రం కరోనా లాంటి పిశాచికి మందు తమ వద్ద ఉందంటూ కలర్ ఫుల్ బోర్డులు పెట్టే తీరు చూస్తే.. శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ అప్రయత్నంగా గుర్తుకు రాక మానదు. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని బోర్డులు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధిని నయం చేసే మందులు తమ వద్ద ఉన్నట్లుగా కొన్ని వైద్య మెడికల్ షాపులు బరితెగించి మరీ బోర్డులు పెట్టేస్తున్నాయి. ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు డాక్టర్స్ హోమియోపతి మందు తమ వద్ద లభిస్తుందని పేర్కొంటున్నారు. ఇలా సందులో బోర్డు పెట్టుకునే బదులు.. ఈ వైరస్ కారణంగా ఉక్కిరిబిక్కరి అయ్యే దేశాలకు తమ వద్ద ఉన్న మందుల్ని పంపితే.. పిట్టల్లా రాలిపోతున్న చాలామందికి ప్రాణాలు పోసినోళ్లు అవుతారు కదా? సమయాన్ని చూసుకొని.. సొమ్ము చేసుకునే ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిని లోపలేయాల్సిన అవసరం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనాకు హోమియో మందు ఉందని ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.