Begin typing your search above and press return to search.

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితం.. జ‌గ‌న‌కు మైన‌స్ అవుతుందా?

By:  Tupaki Desk   |   11 March 2022 11:30 AM GMT
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితం.. జ‌గ‌న‌కు మైన‌స్ అవుతుందా?
X
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. బీజేపీ దూకుడు భారీ ఎత్తున కొన‌సాగింది. అతి పెద్ద రాష్ట్రం యూపీలో అస‌లు ఓడిపోతుంద‌ని అనుకున్న బీజేపీ మ‌రోసారి పుంజుకుని..ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా అధికారం నిల‌బెట్టుకుంది. అదేవిధంగా మ‌రో రెండు రాష్ట్రాలు, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌లోనూ.. విజ‌యం సాధించింది.

ఇక‌, తీర ప్రాంత ప‌ర్యాట‌క రాష్ట్ర గోవాలోనూ.. బీజేపీ స‌త్తా చాటింది. ఈ నేప‌థ్యంలో బీజేపీని ఎద‌రించి నిలిచే పార్టీ లేకుండా పోయింద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే.. ఈ ఎన్నిక‌ల ఫ‌లితం ఏపీపై ప్ర‌భావం చూపుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఎలా అంటే.. జాతీయ స్థాయిలో బీజేపీ ఫుల్ మెజారిటీ దిశ‌గా దూసుకుపోతోంది. దీనిని బ‌ట్టి 2024 సార్వ‌త్రి క‌ ఎన్నిక‌ల్లో కూడా కేంద్రంలో బీజేపీ ఒంట‌రిగానే అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో ఏ పార్టీ తోడు, పొత్తు లేకుండా బీజేపీ మోడీ సార‌ధ్యంలో కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

దీంతో ఏపీలోని వైసీపీ అధినేత ఆశ‌లు తీరేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌.. కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాకూడ‌ద‌ని, త‌ద్వారా.. త‌మ మ‌ద్ద‌తు అవ‌స‌రం అవుతుంద‌ని.. అప్పుడు..ఏపీకి సంబందించిన ప్ర‌యోజ‌నాల‌ను సాధించాల‌ని అనుకున్నారు.

కానీ, అలా సాధ్యం కాలేదు. ఇదే విష‌యాన్ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. కేంద్రంలో ఫుల్ మెజారిటీ వ‌చ్చిన నేప‌థ్యంలో త‌మ‌కు ప్లీజ్ ప్లీజ్ అన‌డం త‌ప్ప‌.. ఏమీ సాధ్యం కాద‌ని చెప్పారు. ఇక‌, వ‌చ్చే సార్వ‌త్రిక స‌మ‌రంలోనూ ఇదే సీన్ క‌నిపించ‌నుంది. ఎందుకంటే.. ప‌రోక్షంగా బీజేపీ మ‌ద్ద‌తిచ్చే అవ‌కాశం కూడా వైసీపీకి క‌నిపించ‌డం లేదు.

త‌మ‌కు ఎలానూ.. యూపీ స‌హా నాలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విజ‌యం ద‌క్క‌డంతోపాటు.. ఇప్ప‌టికే అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఉండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ వైసీపీని ప‌ట్టించుకునే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.

జ‌గ‌న్ ఏపీకి కావాల్సిన నిధుల కొసం.. లేక‌పోతే.. అభివృద్ధి కోసం.. ఇవీ కాక‌పోతే.. ప్ర‌తిప‌క్షం ఆరోపిస్తున్న‌ట్టు త‌న‌పై ఉన్న కేసుల కోసమో.. మోడీ ద‌గ్గ‌ర కొంచెం బెండ్ అయి ఉన్నార‌నేది మేధావులు చెబుతున్న మాట‌. బీజేపీకి కూడా ఫ్యూచ‌ర్‌లో జ‌గ‌న్ అవ‌స‌రం అవుతుంద‌నే ఉద్దేశంతో ఇప్ప‌టి వ‌రకు చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది.

కానీ, ఇప్పుడు మాత్రం బీజేపీ పుంజుకోవ‌డం.. భారీ ఎత్తున దేశంలో అనుకూల ప‌వ‌నాలు వీస్తుండంతో బీజేపీ వైసీపీని లెక్క‌చేసే ప‌రిస్థితి ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఏం చేస్తార‌నేది ప్ర‌శ్న‌గా మారింది. చూడాలి.. మ‌రి ఏం చేస్తారో.