Begin typing your search above and press return to search.

ఏపీ సీఎస్ అయితే కోర్టు మెట్లు ఎక్కటానికి రెఢీ కావాల్సిందేనా?

By:  Tupaki Desk   |   10 March 2022 7:30 AM GMT
ఏపీ సీఎస్ అయితే కోర్టు మెట్లు ఎక్కటానికి రెఢీ కావాల్సిందేనా?
X
దేశంలో మరే రాష్ట్రంలో లేని చిత్రవిచిత్ర పరిస్థితులు ఏపీలో ఉన్నట్లు చెబుతున్నారు. తరచూ కోర్టు చేత మొట్టికాయలు వేయించుకోవటం.. వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలవటం.. నిత్యం ఏదో ఒక వివాదంలో ప్రభుత్వం ఇరుక్కోవటం.. ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా గ్యాప్ లేకుండా గడబిడ పరిస్థితుల్లో పాలన చేయటంలో జగన్ సర్కారు తర్వాతే ఎవరైనా అంటున్నారు. సాధారణంగా పాలకులు ఎవరైనా సరే.. తమ పాలనా రథానికి సారథిగా నియమించిన వారికి ఇబ్బంది పడని రీతిలో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ.. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉందంటున్నారు.

రాష్ట్ర పాలనా రథానికి సారథిగా వ్యవహరించేది సీఎస్ (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి). ఆ స్థానంలో ఉన్న వారు తీసుకునే నిర్ణయాలు కోర్టు ముందుకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకు భిన్నంగా ఏపీలో పరిస్థితి ఉందంటున్నారు. రాష్ట్ర సీఎస్ స్థాయిలో ఉండి కూడా పాలనా పరమైన నిర్ణయాలకు సంబంధించిన కోర్టు మెట్లు ఎక్కాల్సి రావటం ఈ మధ్యన ఎక్కువైందంటున్నారు. దీనికి కారణం.. జగన్ సర్కారు ఒంటెద్దు పోకడగా చెప్పక తప్పదు.

తాము చెప్పిందే చేయాలని చెప్పటం.. రూల్ పొజిషన్ ను పట్టించుకోకుండా సొంత నిర్ణయాల్ని తీసుకోవటం.. సొంత నిర్ణయాల్ని అమలు చేయాలన్న హుకుం జారీ చేయటంతో పాటు.. పలు ఒత్తిళ్లకు తలొగ్గాల్సి వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే ఏపీ సీఎస్ గా వ్యవహరించిన నీలం సాహ్ని మొదలు కొని తాజాగా సమీర్ శర్మ వరకు అందరికి కోర్టు తిప్పలు తప్పట్లేదంటున్నారు.

స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘానికి సమరించే విషయంలో నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన నీలం సాహ్ని పని చేయకపోవటంతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని కాదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించటం.. దీనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆమెపై కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆమె కోర్టుకు రాక తప్పలేదు. నీలం సాహ్ని తర్వాత సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్ కు సైతం కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన బిల్లులను ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండటంతో వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చివరకు వారు హైకోర్టును ఆశ్రయించటంతో.. కోర్టు ఇచ్చిన సమన్లను తీసుకున్న ఆదిత్యనాథ్ దాస్ సైతం కోర్టుకు హాజరు కాక తప్పలేదు. తాజాగా సీఎస్ గా వ్యవహరిస్తున్న సమీర్ శర్మ సైతం కోర్టు ముందు రాక తప్పలేదు.

కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవటంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. వారు కోర్టును ఆశ్రయించటం.. దీంతో ఆయన న్యాయస్థానానికి వచ్చి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా జగన్ ప్రభుత్వంలో సీఎస్ గా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరుహైకోర్టు గడప తప్పని పరిస్థితి నెలకొంది.