Begin typing your search above and press return to search.
బీజేపీ కరీంనగర్ సెంటిమెంట్ నమ్మిందే? ఫలితం ఉంటుందా?
By: Tupaki Desk | 20 March 2020 1:30 AM GMTతెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా ఉన్న ఈ జిల్లా తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం కూడా కీలకంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రధాన రాజకీయ నాయకులంతా ఈ జిల్లాకే చెందినవారే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అయినా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రమైనా రాజకీయాల్లో ఈ జిల్లా నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ కూడా గుర్తించి ఆ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ కుమార్ ను నియమించడం వెనుక ఇదే కారణంగా తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ రాజకీయంగా బాగా కలిసి వస్తుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే అదే సంప్రదాయాన్ని బీజేపీ పాటించి సంజయ్ కి పగ్గాలు అప్పగించింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమాల ఖిల్లా. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించింది. అనంతరం తెలంగాణ అవతరించింది.. ఈ జిల్లాకు విశేష ప్రాధాన్యం లభిస్తోంది. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం లో ఐదుగురు కీలక స్థానాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తే. కాకపోతే నియోజకవర్గం మాత్రం ఇతర జిల్లాలో ఉంది. ఇక టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఇది అందరికీ తెలిసిందే. కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మంత్రితో ఏకంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కూడా ఈ జిల్లాకు చెందిన వారే. జిల్లాకు చెందిన ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జగిత్యాలకు చెందిన ఎల్.రమణ టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇక బీజేపీలోనూ ఉమ్మడి కరీంనగర్ నుంచి జాతీయ స్థాయి తో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రముఖ నాయకులుగా పని చేశారు. బీజేపీలోనూ రాష్ట్ర, కేంద్ర రాజకీయల్లో కీలకంగా వ్యవహరించిన వారు కరీంనగర్ జిల్లా నుంచి ఉన్నారు. చెన్నమనేని విద్యాసాగర్ రావు బీజేపీ ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ విధంగా అన్ని లెక్కలు వేసి మరీ బీజేపీ ఎంపీ సంజయ్ కుమార్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. యువకుడిగా.. దూకుడుతనం ఉన్న సంజయ్ కి ఆర్ఎస్ఎస్ నుంచి కూడా దీవెనలు ఉండడం.. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో సంజయ్ కుమార్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ సెంటిమెంట్ సంజయ్ తో పాటు బీజేపీకి కలిసి వస్తుందో లేదో వేచి చూడాలి.