Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు ఊపిరి వస్తున్నట్లేనా ?
By: Tupaki Desk | 8 March 2022 6:08 AM GMTతాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారమైతే కాంగ్రెస్ కు కాస్త మంచి కాలమనే చెప్పాలి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి నానా అవస్థలు పడుతోంది కాంగ్రెస్. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరాఖండ్, గోవాలో కాంగ్రెస్ కు అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్ లో అధికారంలోకి రావటం ఖాయమని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అలాగే గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలో అర్ధమవుతోంది.
ఉత్తరాఖండ్ విషయం చూస్తే ఇక్కడ 70 సీట్లున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 35-40 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయమని దాదాపు అన్నీ సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ అధికార బీజేపీకి సమస్య ఏమిటంటే ఐదేళ్ళల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు మారటమే. పైగా పార్టీలో వర్గాలు విపరీతంగా పెరిగిపోయి ఒకదానితో మరో వర్గం ఎప్పుడూ గొడవలు పడుతునే ఉన్నాయి. దీంతోనే జనాలు బీజేపీ అంటే విసిగెత్తిపోయారు.
అందుకనే ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలే రాబోతున్నాయి. బీజేపీకి 30 సీట్లు, బీఎస్పీకి 2 సీట్లు మిగిలిన సీట్లలో ఇతరులు గెలుచుకుంటారట. ఇక గోవాలో 40 సీట్లున్నాయి. వీటిలో కాంగ్రెస్ సుమారుగా14-19 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకి 13-18 మధ్య రావచ్చని, ఎంజీపీ కూటమి 5 సీట్లు గెలుచుకోవచ్చని ఇండిపెండెంట్లు కూడా ఎక్కడైనా గెలవచ్చని తేలింది. అంటే గోవాలో కనుక కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త పడితే అధికారం లోకి వచ్చే అవకాశముంది.
ఇక మణిపూర్ లోని 60 సీట్లలో అధికార బీజేపీ 32-38 సీట్ల మధ్యలో గెలుస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ 12-17 సీట్ల మధ్య గెలుస్తుందని చెబుతున్నది. ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు మిగిలిన సీట్లు గెలుస్తారట.
అయితే మరికొన్ని సర్వేల్లో మాత్రం మణిపూర్ లో హంగ్ తప్పదని కూడా వచ్చాయి. పంజాబ్ లోని 117 సీట్లలో ఆప్ కు 61 సీట్లు వస్తాయని కొన్ని సర్వేలు చెబితే మరికొన్ని సర్వేల్లో 90 సీట్లు ఖాయమన్నాయి. మొత్తం మీద పంజాబ్ లో ఆప్ అధికారంలోకి రావటం తథ్యమని తేలిపోయింది. ఇక్కడ అధికార కాంగ్రెస్ 26-33 సీట్లు వస్తాయట. మొత్తం మీద ఒక కాంగ్రెస్ కు కాస్త ఊపిరి పోసేట్లే ఉంది ఈ ఎన్నికలు.