Begin typing your search above and press return to search.

మృత్యువు ఇలా కూడా కబళిస్తుందా? డ్యాన్స్ చేస్తూ మరణం.. వైరల్ వీడియో

By:  Tupaki Desk   |   3 Sep 2022 4:32 AM GMT
మృత్యువు ఇలా కూడా కబళిస్తుందా? డ్యాన్స్ చేస్తూ మరణం.. వైరల్ వీడియో
X
చావు అనేది ఎవరికి ఎక్కడ రాసిపెట్టిందో తెలియదు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా అది దరిచేరుతుంది. ఇటీవల పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం అందరినీ కృంగి దీసింది.అచ్చం అలాగే ఓ వ్యక్తి ఎంతో హుషారుగా డ్యాన్స్ చేస్తుండగా కుప్పకూలిపోయాడు. ఆ వీడియో చూశాక ఇప్పుడందరూ మృత్యువు ఇలా కూడా కబళిస్తుందా? అని షాక్ అవుతున్నారు.

రెప్పపాడులో ఓ వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఉత్తరప్రదేశ్ లోని బారెల్లీలో అలాంటి షాకింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. అప్పటివరకూ బాగా డ్యాన్స్ చేసిన మనిషి సడెన్ గా కన్నుమూశారు.

ఓ వ్యక్తి బర్త్ డే వేడుకలో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న మనిషి సడెన్ గా కుప్పకూలిపోయాడు. దీంతో అంతా షాక్ కు గురవుతున్నారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. డ్యాన్స్ చేస్తుండగానే అతడికి హార్ట్ ఎటాక్ వచ్చిందని.. దీంతో అక్కడికక్కడే చనిపోయాడని డాక్టర్లు వెల్లడించారు.

కొన్ని రోజులుగా ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడం ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నవయసు వారే ఊహించని విధంగా మరణిస్తుండడం విషాదం నింపుతోంది. బర్త్ డే పార్టీకి హాజరైన ఓ వ్యక్తి బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తున్నాడు. పాటకు తగ్గట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నాడు. కాసేపు అలానే డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. చప్పట్లు కొడుతూ అతడిని అంతా ప్రోత్సహిస్తున్న వేళ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

దీంతో అందరూ వచ్చిలేపినా లేవలేదు. కంగారుపడి చూడగా చలనం లేకుండా పోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని డాక్టర్లు చెప్పడం మైండ్ బ్లాంక్ చేసింది.

సడెన్ గా కుప్పకూలిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా కూడా మరణం వస్తుందా? అని అంతా షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.