Begin typing your search above and press return to search.
డెల్టా ప్లస్ ఇంకా ఉనికిలో ఉందా...? ఒక్కసారిగా ఉలికిపాటు
By: Tupaki Desk | 3 Jan 2022 1:30 AM GMTచైనాలో రెండేళ్ల క్రితం వెలుగుచూసిన వూహాన్ స్ట్రెయిన్ కరోనా అనంతరం ప్రపంచంలో ఇప్పటివరకు లక్షలాది కరోనా వేరియంట్లు వచ్చాయి. ఈ వేరియంట్లలో 99.99 శాతం మనుగడలో లేకుండా పోతాయి. మిగిలిన ఆ స్పల్ప శాతంలో కొన్ని అత్యంత ప్రమాదకరంగా మారొచ్చు. మరికొన్ని మధ్యస్థ ప్రమాదకారులుగా ఉండిపోవచ్చు. ఇలా పుట్టుకొచ్చిన వాటిలో డెల్టా ఒకటి. మహారాష్ట్రలో ఉద్భవించిన ఈ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం రేపింది. పది లక్షల పైగా ప్రాణాలు తీసిందంటే దీని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఒమైక్రాన్ వేరియంట్ కు పూర్వం ప్రపంచమంతా డెల్టా ప్రభావమే ఉంది.
అయితే, దీని అదనపు మ్యుటేషనే (ఉప వేరియంట్) డెల్టా ప్లస్. ఇది కూడా మన దేశంలోనే పుట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డెల్టా ప్లస్ ను ఆందోళనకారక వేరియంట్ గానూ ప్రకటించింది. అయితే, డెల్టా ముగింపు సమయమైన జూన్-జూలై నెలల్లో రావడానో ఏమో ఈ వేరియంట్ అంత ప్రభావం చూపలేదు. లక్ష కేసులకు ఒక్క కేసూ రావడం లేదు. దీని తల్లి లాంటి డెల్టానే డేంజరస్ గా మారింది. అయితే, తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి డెల్టా ప్లస్ నిర్ధారణ కావడం కొంత ఉలికిపాటుకు గురిచేసింది. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం గంగూలీ కోల్ కతాలోని వుడ్‌లాండ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆయనకు ఒమిక్రాన్ సోకిందేమోనని పరీక్షలు నిర్వహించారు.
అందులో నెగెటివ్ రావడంతో డిశ్ఛార్జి చేశారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో గంగూలీకి డెల్టా ప్లస్ పాజిటివ్‌గా గుర్తించారు. లక్షణాలు స్వల్పంగా ఉండటంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.
డెల్టా కాదు.. ఒమిక్రాన్ లేదు గంగూలీకి డెల్టా ప్లస్ నిర్ధారణ కావడం ఆశ్చర్యం రేపుతోంది. అసలు ఈ వేరియంట్ దేశంలో ఉనికిలోనే లేదు. ప్రస్తుతం డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ మాత్రమే వ్యాప్తిలో ఉన్నాయి. డెల్టా క్రమంగా వెనుకకుపోయి ఒమైక్రాన్ డామినేట్ చేస్తోంది. వాస్తవానికి డెల్టా మన దేశంలోనే పుట్టింది.
తొలి వేవ్ అనంతరం భారత్ లో మహారాష్ట్రలో కరోనా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. దీంతో పండగలు, సామూహిక కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో కొవిడ్ కొత్త వేరియంట్ డెల్టా పుట్టుకొచ్చింది. ఇది ఎంతటి ప్రమాదకారో గతేడాది వేసవిలో చూశాం. భారత్ లో సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా దాదాపు 5 లక్షల మంది ప్రాణాలు బలిగొంది. ఇంకా ఈ సంఖ్య ఎక్కువే ఉండొచ్చు. సెకండ్ వేవ్ సమయంలో మధ్యప్రదేశ్, గుజరాత్ లో ప్రజలు పెద్ద ఎత్తున చనిపోవడం.. సామూహిక దహనాలు చేయడం చూశాం. డెల్టా ప్రధానంగా శ్వాస వ్యవస్థను దెబ్బతీసింది. దీంతో ఆక్సిజన్ కు భారీగా డిమాండ్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా తీవ్ర కొరత నెలకొంది.
కొత్త వేరియంట్ కాదు డెల్టా ప్లస్.. డెల్టా వేరియంట్ ఉత్పరివర్తనమే. ఇది కూడా భారత్ లో పుట్టినదే. అయితే, అంత ప్రమాదకారి కాదు. అందుకనే చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయ. డెల్టాతో దాదాపు 3 కోట్ల కేసులు రాగా.. డెల్టా ప్లస్ కేసులు మహా అంటే వెయ్యి కూడా ఉండవు. ఇక దక్షిణాఫ్రికాలో బీటా వేరియంట్ పుట్టినా.. ఇదీ వ్యాప్తి వేగం పెద్దగా లేక కనుమరుగైంది. వాస్తవానికి బీటా వేరియంట్ తీవ్రత చాలా ఎక్కువ. కానీ, వ్యాప్తి లేక సమసిపోయింది.
మరోవైపు ఇప్పుడు కలకలం రేపుతున్న ఒమైక్రాన్ కూడా దక్షిణాఫ్రికాలోనే పుట్టింది. వ్యాప్తి తీవ్రత చాలా అధికం. అయితే, తీవ్రత లేదు. ఈ నేపథ్యంలోనే అమెరికా, యూరప్ దేశాల్లో లక్షలాది కేసులు వస్తున్నా మరణాలు ఉండండం లేదు. కాగా, డెల్టా ప్లస్ వేరియంట్ ఈ ఏడాది జూన్ -జూలైలో దేశంలో వెలుగులోకి వచ్చింది. తర్వాత ఆల్ఫా, గామా, కప్పా వేరియంట్లు కూడా బయటపడ్డాయి. డెల్టా ప్లస్ అసలు ఇప్పుడు ఉనికిలోనే లేదు. కానీ, అనూహ్యంగా గంగూలీకి ఈ వేరియంట్ సోకడం ఆశ్చర్యం రేపుతోంది.