Begin typing your search above and press return to search.

మందు కొట్టగానే ఇంగ్లీష్ తన్నుకొస్తుందా ? అసలు కారణం ఇదే !

By:  Tupaki Desk   |   20 March 2021 8:30 AM GMT
మందు కొట్టగానే ఇంగ్లీష్ తన్నుకొస్తుందా ? అసలు కారణం ఇదే !
X
ఇంగ్లీష్ మాట్లాడటానికి చాలామందికి కొంచెం భయం. ఇంగ్లీష్ వచ్చినప్పటికీ చిన్న చిన్న తప్పులు వస్తాయని ఇంగ్లీష్ మాట్లాడటమే మానేస్తారు. కానీ, కొంతమంది పార్టీలలో మద్యం తీసుకున్న తర్వాత అకస్మాత్తుగా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు. వారు పూర్తి విశ్వాసంతో నిర్భయంగా ఇంగ్లీష్ లో మాట్లాడటం ప్రారంభిస్తారు. ఆ తర్వాత వారు ప్రతి ప్రశ్నకు ఆంగ్లంలో కూడా సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతారు. ఇది ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా , వాస్తవానికి, జనం అలా చేయడం వెనుక శాస్త్రీయ కారణం ఉందట.

ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఒక పరిశోధనలో కనుగొన్నారు పరిశోధకులు. సైన్స్ మ్యాగజైన్ 'జర్నల్ ఆఫ్ సైకోఫార్మాకాలజీ’లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం, కొంతమంది 1-2 పెగ్ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కాస్త టెన్షన్ కు గురవుతారట. అందుకే వాళ్ళు ఇతర భాషలో మాట్లాడటం ప్రారంభిస్తారట, మరీ ముఖ్యంగా ఇండియాలోకి మందు బాబులు అయితే మూడో పెగ్గు నుండి చాలా మంది ఇంగ్లీషులో మాట్లాడటం ప్రారంభిస్తారు. మద్యం తాగడం ప్రజల జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత శక్తిని ప్రభావితం చేస్తుంది.

ఈ సమయంలో, కొంతమంది వ్యక్తిత్వం పూర్తిగా మారుతుంది అలాగే వారి విశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ ప్రక్రియ జరిగిన వెంటనే, వారు ఆ విషయాలపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. అదే విషయాన్ని వాళ్ళు మత్తులో లేనప్పుడు చేయడానికి వెనకాడతారు. మరొక భాష మాట్లాడటమే కాకుండా, కొంతమంది మందుబాబులు మందేశాక వేరు వేరు పనులు చేయడం కూడా ప్రారంభిస్తారు. అంటే మామూలు సమయంలో నృత్యం చేయడానికి లేదా పాడటానికి వెనుకాడే వ్యక్తులు, కూడా తాగాక లెగ్గు కదుపుతారు. చాలా ఈజ్ తో డాన్స్ చేస్తారు. ఇంగ్లీష్ మాత్రమే కాదు.. కొందరు మద్యం తాగిన తరువాత తమకు వచ్చిన వేరే భాషల్లో కూడా మాట్లాడుతుంటారు.