Begin typing your search above and press return to search.

సీఎస్ బదిలీ తర్వాత ఐఏఎస్ ల ఫోన్ కాన్ఫరెన్స్ జరిగిందా?

By:  Tupaki Desk   |   5 Nov 2019 8:36 AM GMT
సీఎస్ బదిలీ తర్వాత ఐఏఎస్ ల ఫోన్ కాన్ఫరెన్స్ జరిగిందా?
X
ఉరుములేని పిడుగులా ఉన్నట్టుండి ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేశారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల సంఘం నియమించిన ఎల్వీ సుబ్రమణ్యాన్ని జగన్ ప్రభుత్వం ఐదు నెలల పాటు కొనసాగించింది. ఒకవేళ ఆయనను మార్చాలని అనుకుంటే మొదట్లోనే మార్చి ఉండవచ్చు. అయితే ఇప్పుడు అనూహ్యంగా మార్పు జరిగింది.

అది కూడా ఎలాంటి రాజకీయ పరిణామాలూ బయటకు కనపడలేదు. సూఛాయగా కూడా అలాంటి దాఖలాలు కనిపించలేదు కూడా. ఒక విధంగా సంచలనం అనిపించేలా, షడన్ గా సీఎస్ హోదా నుంచి ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేసింది ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో ఈ అంశం ఐఏఎస్ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. తమ విభాగాల్లో టాప్ క్యాడర్ లాంటి హోదాలోని వ్యక్తిని అంత అనూహ్యంగా, అంత షడన్ బదిలీ చేయడం పట్ల అధికారులు చర్చించుకుంటున్నారట.

ఇందుకు సంబంధించి కొందరు అధికారులు ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించుకున్నట్టుగా మీడియాలో ప్రచారం సాగుతూ ఉంది. ఎల్వీని ఎందుకు బదిలీ చేశారు, అందుకు ఏ పరిణామాలు కారణం? అనే అంశాల గురించి వారు చర్చించుకున్నట్టుగా సమాచారం. అంతా కలిసి మీటింగ్ పెట్టుకోవాలని, ఈ అంశాల గురించి మాట్లాడుకోవాలని అనుకున్నారట. అయితే అలా చేస్తే… లేనిపోని అనుమానాలు రేగుతాయని, అధికారులు ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించుకున్నట్టుగా తెలుస్తోంది.