Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ బ‌ల‌ప‌డ్డాడా ! బ‌ల‌హీన ప‌డ్డాడా?

By:  Tupaki Desk   |   11 Feb 2022 3:09 AM GMT
జ‌గ‌న్ బ‌ల‌ప‌డ్డాడా ! బ‌ల‌హీన ప‌డ్డాడా?
X
నిన్న‌టి వేళ ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో ఇండ‌స్ట్రీ పెద్ద‌లు (చిరుతో స‌హా ఇంకొంద‌రు ప్ర‌ముఖులు) జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయ్యాయి.ఓ విధంగా ఇరు వ‌ర్గాల మ‌ధ్య కొన్ని విష‌యాల‌లో సానుకూల ధోర‌ణి ఒక‌టి స్ప‌ష్టంగా క‌నిపించింది.ఇక ఈ వివాదం త్వ‌ర‌లోనే ముగిసిపోనుంద‌న్న ఆశాభావం ఒక‌టి చిరంజీవి వ్య‌క్తం చేయ‌డం ఆనందదాయ‌క ప‌రిణామ‌మే! అటు చిరంజీవి ఇటు అల్లు అర‌వింద్ అంతా క‌లిసి కొంత ప్ర‌య‌త్నం చేసి విష‌యాన్ని ఒడ్డుకు చేర్చారు.జ‌గ‌న్ కూడా దిగివ‌చ్చారు.అంటే ఇండ‌స్ట్రీ పై జ‌గ‌న్ ప‌ట్టుపెంచుకున్నారా? అంటే ఔన‌నే చెప్పాలి.

క‌మ్మ సామాజిక‌వర్గం ప్రాబ‌ల్యం ఉన్న ఇండ‌స్ట్రీ పై ఎప్ప‌టి నుంచో జ‌గ‌న్ ప‌ట్టు పెంచుకోవాల‌నే చూస్తున్నారు.ఆ రోజు చంద్ర‌బాబు హయాంలో చాలా అంటే చాలా హ‌డావుడి చేసిన రాజ‌మౌళి ఇంకా ఇంకొంద‌రు ఇవాళ సీఎం ద‌గ్గర చ‌ర్చల నిమిత్తం వెళ్ల‌డం ఓ విధంగా జ‌గ‌న్ సాధించిన విజ‌య‌మే! రాజ‌ధాని అంటే 3డీ యానిమేటెడ్ వెర్ష‌న్ అని చంద్ర‌బాబు భావించి, విజువ‌లైజ్ చేయించిన‌ప్పుడు రాజ‌మౌళి లాంటి పెద్ద‌లు రోజు చంద్ర‌బాబుకు స‌హ‌క‌రించారు.త‌రువాత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న‌కు

క‌నీసం శుభాకాంక్ష‌లు కూడా చెప్ప‌లేదు. కానీ జ‌న‌సేన మాత్రం త‌న‌కు టాలీవుడ్ పెద్ద‌లు స‌న్మానం చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇదంతా చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు.ఇది కూడా ఓ నిజం కావొచ్చు.

ఇండ‌స్ట్రీ అంతా క‌మ్మ సామాజిక‌వ‌ర్గంకు చెందిన మ‌నుషులే కావ‌డం అందులో నాగ్ లాంటి కొంద‌రు మిన‌హా మిగ‌తా వాళ్లెవ్వ‌రూ ఆ రోజు వైసీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డం వంటివి జ‌గ‌న్ ను పున‌రాలోచ‌న‌లో ప‌డేశాయి. నాగార్జున కూడా మొద‌ట నుంచి వైసీపీ వెంటే ఎందుకు ఉన్నారంటే నిమ్మ‌గడ్డ లాంటి పెద్ద‌ల‌తో వ్యాపార లావాదేవీలు ఉండ‌డ‌మే! ఇదే కార‌ణంతో చిరంజీవి కూడా వైసీపీకి ఇప్పుడిప్పుడే ద‌గ్గ‌ర‌వుతున్నారు.

కానీ నాగ్ ఎన్నిక‌ల్లో వైసీపీకి బాహాటంగా మద్ద‌తివ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. అలీ లాంటి వాళ్లు మాత్రం తెర‌ముందుకు వ‌చ్చారుజ‌. ఓ విధంగా నాగ్ జాగ్ర‌త్త ప‌డి త‌న ప‌ని తాను హాయిగానే చేసుకున్నారు కానీ ఇప్పుడు ఇండ‌స్ట్రీ కోసం చిరు ప‌దే ప‌దే ప్రాథేయప‌డ‌డ‌మే పెద్ద ఇబ్బందిగా ఉంది అభిమానుల‌కు...