Begin typing your search above and press return to search.

మమత కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావడం లేదే ?

By:  Tupaki Desk   |   10 Feb 2022 5:38 AM GMT
మమత కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావడం లేదే ?
X
ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చాలా ఆశలే పెట్టుకున్నట్లున్నారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా ఫుల్లుగా యూపీలో తిరిగేస్తున్నారు. బీజేపీని ఓడించటమే టార్గెట్ గా పెట్టుకున్న మమత ఆ విషయాన్ని బాహాటంగానే చెప్పేస్తున్నారు. కులాలు, మతాలకు అతీతంగా జనాలంతా ఎస్పీకి ఓట్లే వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎస్పీకి 300 సీట్లు వస్తాయని మమత పెద్ద ఆశలే పెట్టుకున్నారు.

ప్రలోభాలకు లొంగకుండా ప్రజలంతా యూపీలో బీజేపీని ఓడిస్తే అదే పనిని దేశంలో తామంతా కలిసి చేస్తామని మమత హామీ ఇచ్చారు. జాతీయస్థాయిలో బీజేపీని అధికారానికి దూరం చేయాలంటే ముందు ఆ పని యూపీతోనే మొదలవ్వాలని మమత లాజికల్ గా ఓటర్లను కన్వీన్స్ చేసేందుకు పెద్ద ప్రయత్నాలే చేస్తున్నారు.

ఎస్పీ కూటమి తరపున మమత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాలికి బలపం కట్టుకుని అని అంటారే ఆ పద్దతిలో మమత ప్రచారం చేస్తున్నారు.

ఒకవైపేమో ప్రీ పోల్ సర్వేలన్నీ బీజేపీదే అధికారం అనంటున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ కూటమికి 325 సీట్లున్నాయి. తాజా ఎన్నికల్లో అన్ని సీట్లు రాకపోయినా మళ్ళీ అధికారానికి అయితే ఢోకా లేదనే సర్వేలు తేల్చేశాయి. అయితే ఆ సర్వేలన్నీ ఎప్పుడో నిర్వహించినవి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి బహుశా ఏ మీడియా కూడా సర్వే చేసుండదు కాబట్టి తాజా పరిస్థితి ఏమిటో తెలీదు. ఎందుకంటే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రాజకీయ సమీకరణలు చాలా మారిపోయాయి.

బీజేపీ నుంచి మంత్రులు, ఎంఎల్ఏలు మొత్తం పదిమంది రాజీనామాలు చేసి ఎస్పీలో చేరిపోయారు. వీరిలో ఓబీసీ సామాజికవర్గాల్లో బలమైన పట్టున్న నేతలున్నారు. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం లో బీజేపీ పైన ఉన్న మంట బయటపడుతోంది. గురువారం నాడు మొదటి విడతగా 58 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

అంటే యూపీ పశ్చిమ ప్రాంతంలోని 128 సీట్లలో 58 చోట్ల పోలింగ్ జరగబోతోంది. ఇక్కడ జాట్లు, ముస్లింలు బీజేపీపై మండిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఒక్కో విడత పోలింగ్ తర్వాత సమీకరణలు మారిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి మమత ఆశలు నెరవేరుతుందా .