Begin typing your search above and press return to search.

ఇపుడు పార్లమెంటు కొత్త భవనం అవసరమా ?

By:  Tupaki Desk   |   13 Dec 2020 1:23 PM GMT
ఇపుడు పార్లమెంటు కొత్త భవనం అవసరమా ?
X
కొత్తగా నిర్మించబోతున్న పార్లమెంటు భవనం విషయంలో ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యుమ్ (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమలహాసన్ సూటిగా ప్రశ్నించారు. మధురైలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించన కమల్ ప్రధానమంత్రి నరేంద్రమోడిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటి పరిస్ధితుల్లో వేల కోట్ల రూపాయలు వెచ్చింది పార్లమెంటు కొత్త భవనం నిర్మించకపోతే ఏమవుతుందని సూటిగా ప్రశ్నించారు. తన ప్రశ్నకు మోడి సమాధానం ఇవ్వాలని కూడా నిలదీశారు.

కరోనా వైరస్ కారణంగా దేశంలోని సగంమంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయినట్లు కమల్ గుర్తుచేశారు. దేశంలోని సగమంది ఆకలితో తిండి దొరక్క అవస్తలు పడుతుంటే పార్లమెంటు భవనానికి వెయ్యి కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందన్నారు. అప్పట్లో చైనా గోడ కట్టడానికి వేలాది మంది కార్మికులు కృషి చేసి చనిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో చైనా గోడను ఎందుకు కడుతున్నారని అడిగిన వాళ్ళకు శతృవుల నుండి దేశాన్ని రక్షించటానికే అని పాలకులు సమాధానం చెప్పినట్లు కమల్ గుర్తుచేశారు. మరిపుడు పార్లమెంటు భవనం కడుతున్నందుకు మోడి ఏమి సమాధానం చెబుతారంటు నిలదీశారు.

ప్రస్తుత పార్లమెంటు భవనానికి 100 సంవత్సరాలు నిండుతున్న కారణంగా కొత్త భవనం అవసరమని ప్రధాని అనుకున్నారు. అంతే కొత్త భవనానికి పనులు చకచక జరిగిపోతున్నాయి. మూడు రోజుల క్రితమే పార్లమెంటు భవన నిర్మాణానికి మోడి శంకుస్ధాపన చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయమై సుప్రింకోర్టులో కేసు కూడా దాఖలైంది. శంకుస్ధాపన చేసుకోవచ్చు కానీ నిర్మాణాలు ప్రారంభించవద్దని కోర్టు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.