Begin typing your search above and press return to search.

కేసీఆర్ బిడ్డ పేరెత్తేందుకు ప‌వ‌న్‌కు భ‌యమా?

By:  Tupaki Desk   |   28 Nov 2019 6:07 AM GMT
కేసీఆర్ బిడ్డ పేరెత్తేందుకు ప‌వ‌న్‌కు భ‌యమా?
X
``2014లో తెలంగాణ ఏర్పడ్డాక...ఒక తెలంగాణ మహిళా ఎంపీ కశ్మీర్‌తో పాటు తెలంగాణ కూడా భారత యూనియన్‌లో బలవంతంగా కలుపబడ్డాయి అన్నారు. అప్పుడు ఎంత గగ్గోలు అయిందో మనందరికీ తెలుసు. రాష్ట్ర విభజనకు ముందు ఉద్యమ సమయంలో కొందరు పెద్ద స్థాయి వ్యక్తులు మాకూ ఈ దేశానికీ సంబంధం లేదు అనడం లాంటి మాటలు మీడియాలో చూశాం. నేనూ విన్నాను`` ఈ మాట‌లు అన్న‌ది ఎవ‌రో తెలుసా? జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్‌. ఆయ‌న పేర్కొన్న మ‌హిళా ఎంపీ ఎవ‌రో మ‌నంద‌రికీ తెలిసిందే. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీగా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించిన కె.అరవిందరావు ఓ ప‌త్రిక‌లో వ్యాసం రాశారు. "కొన్ని మేధావి వర్గాలు మనదేశ సంస్కృతిని మరుగుపరచడానికి అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. దక్షిణ భారతదేశాన్ని సంస్కృతిపరంగా విడదీయడానికి ఒక తాత్త్విక భూమికను తయారు చేస్తూ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు కూడా నిర్వహిస్తున్నారు. దేశంలో జరుగుతున్న అనేక చిన్నచిన్న విషయాల్ని ఒకచోట ఉంచి పరిశీలిస్తే అందులో ఒక పద్ధతి (pattern) కనిపిస్తుంది. అలాంటి ఆలోచనాధార దేశ సమగ్రతకు కూడా ప్రమాదకరం.`` అనేది ఆ వ్యాసం సారాంశం. దానిపై ప‌వ‌న్ స్పందిస్తూ...తెలంగాణ ఉద్య‌మాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

నాలుగు గోడల మధ్య మాట్లాడే మాటలే రెండుమూడు దశాబ్దాల తరవాత ఉద్యమాలుగా మారిపోయే ప్రమాదం ఉందని దానికి ఉదాహరణే తెలంగాణ ఉద్యమమ‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ``1969 , 70 ల్లోనే మేము కలసి ఉండలేం అన్నప్పుడు ఆ అంతరాలను సరి చేయలేదు. నాలుగు గోడల మధ్య మాటలుగా వదిలేశారు. మూడు దశాబ్దాల తరవాత ఉద్యమం అయింది. ప్రత్యేక రాష్ట్రమైంది.`` అని ప‌వ‌న్ పేర్కొన్నారు. అయితే, ప‌వ‌న్ త‌న విశ్లేష‌ణ‌లో ఎక్క‌డా కేసీఆర్ పేరును ప్ర‌స్తావించ‌లేదు. ప్ర‌త్యేక రాష్ట్రం పేరుతో ఉమ్మ‌డి రాష్ట్రం విడ‌గొట్టార‌ని ప్ర‌స్తావించ‌లేదు. ఆఖ‌రికి..ఆయ‌న త‌న‌య క‌విత పేరును ప్ర‌స్తావించ‌లేదు. దీన్ని బ‌ట్టి కేసీఆర్‌కు ప‌వ‌న్ భ‌య‌ప‌డ్డారనుకోవాలా లేదా గౌర‌వించార‌నుకోవాలా అంటూ నెట్టింట చ‌ర్చ జ‌రుగుతోంది.