Begin typing your search above and press return to search.
షర్మిలకు టీడీపీ మద్దతిస్తోందా ?
By: Tupaki Desk | 12 Sep 2021 5:41 AM GMTజగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలు చేయటంలో తెలుగుదేశం పార్టీ నేతలు పూర్తిగా రాంగ్ రూట్లో వెళుతున్నట్లు అనిపిస్తోంది. ప్రభుత్వానికి సంబంధించి ఏ విషయంలో అయినా ఆరోపణలు చేయాలన్నా, విమర్శలు చేయాలన్నా చేయచ్చు. కానీ మధ్యలో జగన్ సోదరి షర్మిలను పిక్చర్లోకి ఎందుకు తెస్తున్నారో అర్ధంకావటంలేదు. షర్మిల వైసీపీ నేతకూడా కాదు. ప్రభుత్వంతో కానీ పార్టీతో కానీ షర్మిలకు ఎలాంటి సంబంధాలు లేవు. ఈ విషయం బయటవ్యక్తులు కాదు స్వయంగా షర్మిలే చాలాసార్లు చెప్పారు.
అయినా సీఎంపై ఆరోపణలను చేయడానికి టీడీపీ నేతలు షర్మిల జపం చేస్తుండటమే విచిత్రంగా ఉంది. తాజాగా అనంతపురంలో రాయలసీమ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనంతపురం పార్లమెంటు ఇన్చార్జి జేసీ పవన్ రెడ్డి మాట్లాడుతూ సొంత చెల్లెలుకే న్యాయం చేయలేని జగన్ ఇక రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తారంటూ వ్యాఖ్యానించారు. సొంత చెల్లెలు షర్మిలకు ఎంపీ, ఎంఎల్ఏ టిక్కెట్ ఇవ్వలేని జగన్ నీటి విషయంలో కేఆర్ఎంబీకి సర్వహక్కులు ఇచ్చేశారంటు ఆరోపణలు చేయటమే విచిత్రం.
షర్మిలకు ఎంఎల్ఏ, ఎంపికి టికెట్ ఇవ్వటం, నీటి విషయంలో కేఆర్ఎంబీకి హక్కులు ఇవ్వటం ఒకటే అన్నట్లుగా మాట్లాడిన పవన్ ఆలోచనా స్థాయి ఏమిటో అర్ధమైపోతోంది. ఏదో జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయాలన్న ఆతృత తప్ప మాట్లాడిన మాటల్లో లాజిక్ ఉందా లేదా అని కూడా టీడీపీ నేతలు చూసుకోవటం లేదు. షర్మిలకు టికెట్ అన్నది పూర్తిగా జగన్ కుటుంబ విషయం. చెల్లెలుకు టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది జగన్ వ్యక్తిగతం. పైగా ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదని షర్మిల చాలాసార్లు చెప్పినా టీడీపీ నేతలు వినకుండా పదే పదే ప్రస్తావిస్తున్నారు.
ఒక్క పవన్ అనే కాదు టీడీపీలో చాలామంది షర్మిల విషయంలో సానుభూతి ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఇంతకీ వారు షర్మిలకు మద్దతిస్తున్నారా ? అనేదే సందేహంగా ఉంది. ఏదో రూపంలో జగన్-షర్మిల మధ్య గొడవలు రావాలనో లేకపోతే వస్తే బాగుణ్ణనో కోరుకుంటున్నట్లుగా ఉంది. షర్మిల టికెట్ ఆశించి భంగపడినా అర్ధముంది. తనకే పోటీచేసే ఉద్దేశ్యం లేదని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా కావాలనే సోదరికే న్యాయం చేయలేని జగన్ అని టీడీపీ పదే పదే విమర్శలు చేయటంలో అర్ధమేలేదు.
ఇక నీటి విషయంలో కేఆర్ఎంబీకి సర్వహక్కులు ఇవ్వటంలో తెలంగాణా ప్రభుత్వం తెంపరితనం వల్లే అని అందరికీ తెలుసు. తనకు లేని హక్కులను చేతిలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలను ఏమాత్రం లెక్క చేయలేదు. దాంతో తెలంగాణా ప్రభుత్వాన్ని నియంత్రించాలంటే కేంద్రం మాత్రమే చేయగలదన్న ఆలోచనతోనే ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో కేంద్రం కేఆర్ఎంబీని రంగంలోకి దించింది. ఈ విషయం అందరికీ తెలిసినా పవన్ రెడ్డి ఇంకా ఆరోపణలు చేస్తున్నారంటే అది ఆయన అజ్ఞానాన్నే బయటపెడుతోంది.