Begin typing your search above and press return to search.
రామోజీ ఫిలింసిటీకి.. గుడివాడ ఎన్ కన్వెన్షన్ కు లింకు పెట్టేసుడా?
By: Tupaki Desk | 24 Jan 2022 5:15 AM GMTఎక్కడా చూడని.. వినని సరికొత్త వాదనల్ని తెర మీదకు తీసుకొస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పటివరకు తమ రాజకీయ ప్రత్యర్థులు చేసే పనుల్ని.. చేపట్టే కార్యక్రమాల్ని సమర్థంగా తిప్పి కొట్టేస్తూ.. తమ పదునైన వాదనతో ఉతికి ఆరేస్తున్న దూకుడు తనానికి దెబ్బ కొట్టేలా సంక్రాంతి వేళ.. గుడివాడలోని ఎన్ కన్వెన్షన్ ఎపిసోడ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిందన్న సంగతి తెలిసిందే. ఒక రాష్ట్ర మంత్రికి చెందిన ఎన్ కన్వెన్ష్ సెంటర్లో కాసినో ను నిర్వహించటం సంచలనంగా మారటంలో సందేహం లేదు. అసలు కాసినో మాటను.. టీడీపీ నేతల కంటే.. సదరు ఈవెంట్ ను నిర్వహించిన పెద్ద మనషులు.. తమ వెబ్ సైట్లలోనూ.. యాప్ లలోనూ.. ప్రచార చిత్రాల్లోనూ వాడారన్న విషయాన్ని పట్టించుకోకుండానే వైసీపీ నేతలు విరుచుకుపడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ వాదనపై మంత్రి కొడాలి నాని చాలా చిత్రమైన రియాక్షన్ ఇచ్చారు. ఆడు ఎవడో టీడీపీ నేతలు కావాలనే ఇలాంటి దరిద్రపుగొట్టు ప్రచారం చేశారని మండిపడ్డారు. మరి.. వెబ్ సైట్ సంగతేంటి? అని అడిగితే.. అది కూడా వాళ్లే ఎవరో పుట్టించి ఉంటారంటూ దిమ్మ తిరిగేలా మాట్లాడి.. షాకిచ్చారు. ఎవరేం అన్నా సరే.. అడ్డ బ్యాటింగ్ తో కాదంటూ మొండిగా సమాధానాలు ఇవ్వాలని డిసైడ్ అయితే ఎవరేం చేయలేరన్నది తెలిసిందే. కాకుంటే.. వారు మాట్లాడే మాటలకు సాక్ష్యాలుగా లైవ్ వీడియోలు వైరల్ కావటం ద్వారా.. తమకే ఎదురు పంచ్ లు పడతాయన్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే.. వైసీపీ నేతలకు అంత తక్కువ డ్యామేజ్ జరుగుతుందని చెప్పాలి.
ఎన్ కన్వెన్ష్ ఎపిసోడ్ లోకి కొత్తగా ఎంటర్ అయ్యారు వైసీపీ సీనియర్ నేత.. మంచి మాటకారి అయిన అంబటి రాంబాబు. గుడివాడలో గోవా కల్చర్ అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన అతకని మాటల్ని మహా ఆవేశంగా మాట్లాడటం ఒక ఎత్తు. మధ్యలోకి ఏ మాత్రం సంబంధం లేని రామోజీ ఫిలింసిటీలో క్యాబరే డ్యాన్స్ లు వేయలేదా? అంటూ మండిపడటం మరో ఎత్తు.
ఆసుపత్రిలో కొడాలి నాని ఉంటే. ఆయనపై తప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ విరుచుకుపడిన వైనం చూస్తే.. నోరు నొక్కుకోవాల్సిందే. తనకు చెందిన కన్వెన్షన్ సెంటర్ లో భారీ ఎత్తున కార్యక్రమాలు జరగటంపై వివరణ ఇవ్వాల్సి వస్తే.. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు జరిగిన విషయం మీద వివరాలు కనుక్కుంటాను అని విషయాన్ని పక్కకు పెట్టేస్తే సరిపోయేదానికి.. రివర్సు గేరులో విరుచుకుపడుతూ అడ్డదిడ్డమైన వాదనల్ని వినిపిస్తున్నారన్న విమర్శల్ని వైసీపీ నేతలు మూటగట్టుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రామోజీ ఫిలిం సిటీ మీద అంబటి చేసిన వ్యాఖ్యల్నే తీసుకుంటే.. సదరు ఫిలిం సిటీ ఏపీ పరిధిలో లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయినప్పటికీ.. క్యాబరే డ్యాన్సుల్ని నిర్వహించటం నైతికమా? అన్న ప్రశ్న వేసుకుంటే.. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే. .దానికి సంబంధించిన వీడియో క్లిప్పుల్ని సాక్ష్యంగా చూపించి.. అదెలా చట్ట విరుద్ధమన్న విషయాన్ని రూల్ బుక్ చూపిస్తూ విమర్శలు చేస్తే బాగుంటుంది. అందుకు భిన్నంగా ఏదో ఒకటి విమర్శలు చేయాలన్నట్లుగా చేయటం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని మర్చిపోకూడదు.
రామోజీ ఫిలింసిటీలో క్యాబరే డ్యాన్సులు వేయలేదా? అని ప్రశ్నించటానికి బదులు.. అలా వేసి ఉంటే.. అది చట్ట విరుద్ధమైతే.. ఆ టైంలో ఆ విషయాన్ని ప్రశ్నించకుండా మౌనంగా ఉండటం కూడా తప్పే అవుతుంది. అప్పుడు మాట్లాడకుండా.. ఇప్పుడు మాట్లాడటంలో ఎలాంటి అర్థం లేదన్న చిన్న విషయాన్ని అంబటి లాంటి పెద్ద మనిషి ఎలా మిస్ అవుతున్నారు? అన్నది అసలు ప్రశ్న.