Begin typing your search above and press return to search.
జగన్ లేఖను కేంద్రం లెక్క చేస్తుందా ?
By: Tupaki Desk | 7 Feb 2021 9:09 AM GMTవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. జగన్ రాసిన లేఖ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవిధంగా ఏమీ లేదు. పైగా ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రం తరపున చేసిన సూచనలు కూడా ఏమీ లేవనే చెప్పాలి. ఉక్కు ఫ్యాక్టరీ గురించి జగన్ లేఖలో రాసిన పాయింట్లన్నీ కేంద్రానికి తెలిసినవే. మరి ఈ పరిస్ధితుల్లో సీఎం రాసిన లేఖను ఎందుకు లెక్కచేస్తుంది ?
నిజానికి క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనంలోకి తీసుకుని ముఖ్యమంత్రి రాయబోయే లేఖ చాలా గట్టిగా ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ చాలా సాదాసీదాగా ఉంది. ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వరంగంలోనే ఎందుకుంచాలనే విషయంలో కూడా జగన్ తన వాదనను గట్టిగా వినిపించలేకపోయారు. నిజానికి ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్రం డిసైడ్ చేసిన తర్వాత ఇక వెనక్కు తగ్గే అవకాశం కనిపించటం లేదు.
కాబట్టి కేంద్రాన్ని రిక్వెస్టు చేసుకోవటం కాకుండా తనవంతుగా రాష్ట్రప్రభుత్వం ఏమి చేయాలని అనుకుంటున్నదో జగన్ స్పష్టంచేయాలని జనాలు అనుకుంటున్నారు. అంటే ఫ్యాక్టరీలో కేంద్రం వాటాను కేంద్రానికి తిప్పిచేసి మొత్తం ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని రాష్ట్రమే సొంతం చేసుకోవటం లాంటి ప్రతిపాదనలను జనాలు ఆశిస్తున్నారు. ఇటువంటి ప్రతిపాదనలు జగన్ రాసిన లేఖలో లేవు.
అయితే ఇదే ప్రతిపాదన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నుండి వచ్చింది. స్టీలు ఫ్యాక్టరీని రాష్ట్రప్రభుత్వం నూరుశాతం సొంతం చేసుకునే అంశాలను పరిశీలిస్తోందని గౌతమ్ చేసిన సూచనకు జనాల నుండి మద్దతు పెరుగుతోంది. అయితే జగన్ ఆదేశాలు లేకుండా మంత్రి ఇటువంటి ప్రతిపాదన చేసే అవకాశం లేదు. కాబట్టి ఫ్యాక్టరీని కాపాడుకునే విషయంలో జగన్ రెండు అంచెల స్ట్రాటజీని అనుసరిస్తున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి సీఎం రాసిన లేఖ తర్వాత కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.