Begin typing your search above and press return to search.
ప్రజలు చావాలని కేంద్రం కోరుకుంటోందా?
By: Tupaki Desk | 28 April 2021 3:30 PM GMTకేంద్రప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో దేశంలో రెమిడెసివిర్ ఇంజెక్షన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.. అయితే దేశంలో కరోనా చికిత్స కోసం రెమిడెసివర్ వాడకంపై కేంద్రం కొత్త ఫొటోకాల్ తీసుకురావడంపై బుధవారం ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా తప్పు అని తప్పు పట్టింది. పూర్తిగా మతిలేని పని..
ఆక్సిజన్ దొరకక.. ఇటు రెమిడెసివిర్ కూడా దొరకకుండా ప్రజలు చావాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నట్లు కనిపిస్తోందని ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రెమిడెసివిర్ కొరతను తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్ ను మారుస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు పేర్కొంది. ఇది పూర్తిగా నిర్వహణలోపం అని తెలిపింది.
తనకు 6 డోసుల రెమిడెసివివర్ కావాల్సి ఉండగా.. కేవలం 3 మాత్రమే ఇచ్చారని.. కేంద్రం కొత్త ప్రొటోకాల్ కారణంగా కేవలం మూడు మాత్రమే పొందగలిగానని పేర్కొంటూ దాఖలు చేసిన పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టు ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ హైకోర్టు జోక్యంతో సదురు లాయర్ కు మిగిలిన డోసులు మంగళవారం రాత్రి అందాయి. దీన్ని బట్టి ఢిల్లీలో మందులు, ఆక్సిజన్ కొరత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.