Begin typing your search above and press return to search.

టచ్​ చేసినంత మాత్రాన కరోనా వస్తుందా.. నిజాలివే!

By:  Tupaki Desk   |   8 Oct 2020 6:00 AM IST
టచ్​ చేసినంత మాత్రాన కరోనా వస్తుందా.. నిజాలివే!
X
ఈ మధ్య కాలం లో కరోనా భయం మరీ ఎక్కువైంది. డోర్​ ముట్టుకున్నా, ఏటీఎం కార్డు పట్టుకున్నా, కీచెయిన్​ ముట్టుకున్నా కరోనా వస్తుందేమోనన్న భయం ప్రజల్లో ఎక్కువై పోయింది. ఏటీఎం సెంటర్ కు వెళ్లి బటన్లు ప్రెస్ చేయాలన్న, లిఫ్ట్ లో బటన్స్ తాకాలన్న, ఆఫీస్ లలో అందరూ తిప్పిన కొళాయిలను ముట్టుకోవాలన్నా భయ పడుతున్నారు. తలుపు గొళ్ళాలు, ఆఫీస్ లలో డోర్లు, ఎంట్రీ లలో ఉండే గేట్లు ఇలా ఏవీ టచ్ చేసినా వైరస్ అంటుకుంటుందేమోనని టెన్షన్ పడుతున్నారు. బయటకు వెళ్లి వచ్చిన వారు తమ ముట్టుకున్న వస్తువులు కొన్నిగంటల పాటు బయటే ఉంచి ఆ తర్వాత తెచ్చుకుంటున్నారు.

అయితే అమెరికా సైంటిస్టులు మాత్రం అంత భయం అవసరం లేదు అంటుంటున్నారు. లైట్ స్విచ్‌లు, డోర్ హ్యాండిల్స్, ఏటీఎం కీబోర్డు లాంటిచోట్ల వైరస్ అనవాళ్లు చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. కరోనా వచ్చిన మొదట్లో అందరూ చాలా భయపడేవారు. ఎక్కడ తాకినా వైరస్ అంటుకొంటుంది. ఆ చేతి లో ముఖాన్ని కనుక తాకితే, మనకు కోవిడ్ వస్తుందుని భావించే వాళ్లం. అయితే ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా నిపుణులు మరీ అంత ఎక్కువ భయ పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

ఉపరితలాలు మీద వైరస్​ ఉండదని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులు, కార్యాలయాలను తరచూ శానిటైజ్​ చేస్తున్నారు. వైరస్​ ఉపరితలాల మీద వైరస్ మూడు రోజుల వరకు బతికే చాన్స్​ ఉన్నప్పటికీ అది ఏమీ వ్యాపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం తుమ్మడం ద్వారా వచ్చే తుంపర్ల ద్వారా వైరస్​ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు తరచూ అన్ని ఆఫీసులు, కార్యాలయాల్లో నిత్యం శానిటైజ్​ చేస్తూ ఉండేవారు. నిజానికి కరోనా ఎక్కువగా వచ్చేది రోగి తుమ్మడం, చీదటం వల్లే లాన్సెట్​ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం, ఉపరితలాల మీద ఒకవేళ ఉన్న వైరస్ ఉన్నప్పటికీ అది వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.