Begin typing your search above and press return to search.
సర్కార్ సమ్మెనే కోరుకుంటోందా.. ?
By: Tupaki Desk | 5 Feb 2022 1:30 AM GMTసమ్మె అంటే అతి పెద్ద సమస్య. సమాజం గుండెల మీద సమ్మెట పోటు. దాని వల్ల ఉద్యోగుల సేవలు ఏ విధంగానూ ప్రజలకు అందవు. అదే సమయంలో డిస్టర్బెన్స్ కూడా అన్ని రకాలుగా ఉంటుంది. అందుకే సమ్మెలు బందులను ఎవరూ కోరుకోరు, అభివృద్ధికి అవి ఆటంకంగా ఉంటాయని అంతా చెబుతారు. ఒక విధంగా ప్రభుత్వం ఎపుడూ సమ్మె దాకా కధను తీసుకురాదు, దాని నివారణ కోసం చాలా మార్గాలలో పరిష్కారాలను వెతుకుతుంది.
కానీ ఏపీ సర్కార్ తీరు చూస్తే సమ్మెలోకి ఉద్యోగులను నెట్టాలనుకుంటోందని ఏకంగా ఉద్యోగ సంఘ నేతలే ఆరోపించడం విశేషం. ఆ ఆరోపణలు కూడా కొంత ఆలోచించేవిగా ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం చర్చలు అంటోంది, కానీ ఉద్యోగులు పెట్టిన ప్రధాన డిమాండ్ల మీద చర్చించమని చెబుతోంది. మరి ప్రధాన డిమాండ్ల మీద చర్చిస్తే కదా పరిష్కారం లభించేది అని ఉద్యోగ నేతలు అంటున్నారు.
మెయిన్ గా ఉన్న వాటిని వదిలేస్తే ఇక చర్చలకు అర్ధమేంటి అని కూడా నిలదీస్తున్నారు. చాయ్ బిస్కెట్ల కోసమా చర్చలా అని వారు ఎకసెక్కమాడుతున్నారు. ఇంకో వైపు చూస్తే సమ్మెలోకి ఉద్యోగులు వెళ్లాలని చూస్తే దాని వల్ల ప్రభుత్వానికి లాభం ఏంటి అంటే చాలానే అంటున్నారు. ముఖ్యమైనది ఉద్యోగులకు జీతాలు ఇవ్వనవసరం లేదు, ప్రతీ నెలా జీతాలకు కనీసంగా అయిదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.
దాని కోసం ఏ నెలకు ఆ నెల వెతుకులాటగానే సీన్ ఉంది. ఇక జనవరి నెల జీతాలు ఇచ్చేశారు. ఉద్యోగులు 7వ తేదీ నుంచి సమ్మె బాట పడుతున్నారు. సమ్మెలోకి ఉద్యోగులు వెళ్లారు అంటే సమ్మె కాలానికి అసలు జీతాలు చెల్లించాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఆ తరువాత చర్చలు సామరస్యంగా జరిగితే సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణిస్తారు. అయితే అది ప్రభుత్వం ఉద్యోగుల మీద ఉదారంగా ఆలోచనలు చేస్తేనే జరిగేది. అంటే మేము సమ్మె కాలాన్ని సెలవు కింద చూడమని అంటే ఆ జీతాలను ఆశించే పరిస్థితి ఉద్యోగులకు ఉండదనే చెబుతున్నారు.
ఇక ప్రభుత్వానికి మరో ధీమా ఉంది అంటున్నారు. ఇపుడు ఎక్కువగా సేవలు అన్నీ కూడా సచివాలయ వ్యవస్థ ద్వారానే చేయిస్తున్నారు. అందువల్ల ఉద్యోగులు సమ్మెలోకి వెళ్ళినా వారితోనే సాగిపోతుంది అన్నదేదో ఉంది అంటున్నారు. ఒకవేళ సచివాలయ ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళ్తే వారికి కూడా ప్రోబేషన్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఆలోచన వేరేగా చేసినా చేయవచ్చు అంటున్నారు.
ఇంకా వారు టెంపరరీ బేసిస్ లోనే వర్క్ చేస్తున్నారు కాబట్టి సర్కార్ మీద తిరుగుబాటు చేయరనే అంటున్నారు. మరో వైపు అన్ని రకాల సేవలు ఆన్ లైన్ లోనే ఇపుడు ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఈ సమ్మె ప్రభావం పెద్దగా ఉండదు అని కూడా అంచనా వేసుకుంటున్నారు. అయితే ఆర్టీసీ, వైద్య, విద్యుత్ సిబ్బంది సమ్మెలోకి వెళ్తే మాత్రం నేరుగా ప్రజల మీద ప్రభావం పడుతుంది. వారిలో కూడా కొన్ని యూనియన్లను ప్రభుత్వం ఇప్పటికే తనకు అనుకూలం చేసుకుంది అంటున్నారు.
ఇలా ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయంలో సర్కార్ కి బహుముఖమైన ఆలోచనలు ఉన్నాయని చెబుతున్నారు. ఇవన్నీ చూసిన మీదటనే ఉద్యోగ సంఘ నేతలు అయితే సమ్మెలోకి తాము వెళ్లాలని ప్రభుత్వమే కోరుకుంటోంది అని ఘాటైన మాటలే వాడుతున్నారు. సమ్మెలోకి తాము వెళ్తే జీతాలు మిగుల్చుకుందామని ప్రభుత్వం చూస్తోందని ఉద్యోగుల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్న మాటలు చూస్తే ఆలోచించాల్సిందే అంటున్నారు. మొత్తానికి అర్ధవంతమైన చర్చలకు తాము ఎంపుడూ సిద్ధమేనని ఆయన అంటున్నారు. చూడాలి మరి మరో నలభై ఎనిమిది గంటలు మాత్రమే సమ్మెకు ఉన్న వేళ ఏదైనా అద్భుతం జరుగుతుందేమో.