Begin typing your search above and press return to search.
భర్త ఆఫీసుకెళ్లి మరీ వేధించడమా? విడాకులిచ్చిన కోర్టు
By: Tupaki Desk | 30 Aug 2022 4:30 PM GMT70వ దశకంలో మొగుడు టార్చర్ భరించలేక చచ్చి చెడి బతికిన మహిళలు చాలా మంది ఉండేవారు. అప్పుడంతా మగాళ్లదే రాజ్యం. కానీ కాలం మారింది. ఈ ఆధునిక యుగంలో భార్యా బాధితులు ఎక్కువై పోతున్నారు. మగాడికి ఇంట్లో స్వేచ్ఛ లేకుండా పోతోంది. చాలా మంది మగాళ్ల వాదన ఇదే. అందుకే టీవీ షోలల్లో మగాళ్ల పరిస్థితులపై అప్పుడప్పుడూ కామెడీ కూడా పేలుతోంది.
భార్యల వేధింపులపై ‘భార్యా బాధిత సంఘాలు’ కూడా వెలిశాయి. భర్త పనిచేసే ఆఫీసుకు భార్య వెళ్లి పది మంది ముందు అతడిని అసభ్య పదజాలంతో తిడుతూ వేధించింది. ఇది చాలా క్రూరత్వమని చత్తీస్ ఘడ్ హైకోర్టు ఏకంగా విడాకులిచ్చి ఆ భార్యకు షాకిచ్చింది. ఓ విడాకుల కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ధంతరి జిల్లాకు చెందిన 32 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగికి 2010లో రాయ్ పూర్ కు చెందిన ఓ మహిళతో వివాహమైంది. అయితే కొంతకాలానికి వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో భర్త.. విడాకుల కోసం రాయ్ పూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య తరచూ తనను వేధిస్తోందని.. కనీసం తన తల్లిదండ్రులను కూడా కలుసుకోనివ్వడం లేదని పేర్కొంటూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వాదోపవాదాలు, సాక్ష్యాలను గమనించిన అనంతరం 2019 డిసెంబర్ లో ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.
అయితే ఆ భార్య హైకోర్టును ఆశ్రయించింది. భర్త తప్పుడు సాక్ష్యాలు చూపించాడని.. ఆ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాలని పిటీషన్ లో కోరింది. ఆమె ఆరోపణలను భర్త తోసిపుచ్చాడు. తనకు వివాహేతర సంబంధం ఉందన్న భార్య ఆరోపణలు తన పరువుకు భంగం కలిగించాయని కోర్టుకు తెలిపాడు. తన భార్య ఆఫీసుకు వచ్చి మరీ తనను అందరి ముందు అసభ్య పదజాలంతో దూషించిందని.. తనను మరో చోటుకు బదిలీ చేయించేందుకు ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసిందని వాపోయాడు.
భార్య క్రూరత్వానికి కరిగిపోయిన హైకోర్టు విడాకులు ఇస్తూ తుది తీర్పు వెలువరించింది. భర్తకు వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు అవాస్తవమని తెలిపింది. తప్పుడు ఆరోపణలతో ఆ భార్య ఏకంగా భర్త ఆఫీసుకెళ్లి.. సహోద్యుగుల ముందర పరువు తీయడం క్రూరత్వమే అవుతుందని మండిపడింది. భర్త తన తల్లిదండ్రులను కలుసుకోనివ్వకుండా వేధించడం.. బదిలీ చేయాలని కోరడం తీవ్రమైన విషయం అని పేర్కొంది. అందుకే ఆ భార్య నుంచి విడాకులు మంజూరు చేస్తూ రాయ్ పూర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి భర్తపై ఈ స్థాయిలో టార్చర్ చేసిన ఆ భార్య ఆట కట్టైంది.