Begin typing your search above and press return to search.
ఏపీ తీరాన్ని సముద్రం తనలో కలుపుకుంటుందా...నిపుణులు ఏం చెప్తున్నారంటే?
By: Tupaki Desk | 1 Nov 2021 11:30 PM GMTవిశాఖ లో ప్రస్తుతం ఉన్న తీరానికి చాలా దూరంలో 50 ఏళ్ల క్రితం తీరం ఉండేదని స్థానిక మత్స్యకారుడు అమ్మోరు చెప్పారు. ఆ స్థలంలో తాము ఆటలాడుకునేవాళ్లమని, ప్రస్తుతం సముద్రం ముందుకు రావడంతో ఆటస్థలం పోయి, రోడ్డు మాత్రమే మిగిలిందని తెలిపారు.
విశాఖ హార్బర్ నుంచి భీమిలి వరకు 32 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతముంది. ఇందులో ఆర్కే బీచ్, సబ్ మెరైన్ ఏరియా, వుడా పార్కు, పెదజాలారిపేట, జోడుగుళ్లపాలెం, సాగరనగర్, భీమిలి తీరాల్లో సముద్రం ముందురావడం తరచూ ఎక్కువగా సంభవిస్తుంది. ఇలా ముందుకు రావడం అనేది చాలా తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకురావడం, ఐపీసీసీ రిపోర్ట్ లో పేర్కొన్నట్లు సముద్రం ముంచెత్తడం ఒకటి కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
80 ఏళ్లలో భారతదేశంలోని 12 తీర ప్రాంత నగరాలు నీట మునిగిపోతాయి. ప్రపంచంలో సముద్ర మట్టం పెరిగే రేటు ఆసియాలోనే ఎక్కువగా ఉంది అని ఐపీసీపీ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఈ నివేదికపై దేశవ్యాప్తంగా సముద్ర, భూ వాతావరణ నిపుణుల్లో చర్చ జరుగుతోంది. వాతావరణంలో వచ్చిన మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన సంస్థ ఐపీసీసీ. దీనిని 1988లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరానమెంటల్ ప్రోగ్రాం, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా స్థాపించాయి. తీర ప్రాంత నగరాల అభివృద్దికి సముద్రాలే కారణం. పోర్టులు, పర్యటక ప్రదేశాలు, మత్స్యపరిశ్రమ అభివృద్ధితో ఆయా ప్రాంతాలు నగరాలుగా అభివృద్ధి చెందాయి. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సముద్రాలను కాపాడుకునేలా మనిషి జీవన విధానం ఉండటం లేదని నిపుణులు అంటున్నారు.
విశాఖతో పాటు తీరప్రాంత నగరాలైన ముంబయి, చెన్నై, కొచ్చి, కాండ్లా, ఓఖా, భావ్ నగర్, మంగళూర్, పారాదీప్, ఖిదిర్పుర్, తూత్తుకుడి, మోర్ముగావ్లు 2100 నాటికి మునిగిపోతాయని ఐపీసీసీ రిపోర్టులో వెల్లడించింది. ఈ సంస్థ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతంలో ఉన్న నగరాలపై రిపోర్టును తయారు చేసింది.నాసా రూపొందించిన ప్రొజెక్షన్ టూల్ ద్వారా ఐపీసీసీ రిపోర్ట్‌ను పరిశీలిస్తే ఖిదిర్పుర్ 0.16 మీటర్లు, విశాఖ 0.54, కాండ్లా 0.57, మంగళూరు 0.57, చెన్నై 0.57, ముంబయి 0.58, తూత్తుకుడి 0.59, పారాదీప్ 0.59, ఓఖా 0.60, మోర్ముగావ్ 0.63, కొచ్చి 0.71, భావ్‌నగర్‌లో 0.82 మీటర్ల మేర 2100 నాటికి సముద్రమట్టాలు పెరుగుతాయని పేర్కొంది.ఐపీసీసీ రిపోర్టు ప్రకారం రానున్న 80 ఏళ్లలో మన దేశంలోని 12 తీర ప్రాంతాల్లో కనిష్ఠంగా 0.16 మీటర్ల నుంచి గరిష్ఠంగా 0.82 మీటర్ల వరకు సముద్రమట్టాలు పెరుగుతాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మాజీ రీజనల్ హెడ్ డాక్టర్ జీపీఎస్ మూర్తి చెప్పారు
కాకినాడ, మచిలీపట్నం, ముంబయి, కొచ్చి, చెన్నై, బాలాసోర్, గోపాల్ పూర్ తీరాలు సముద్రమట్టం కంటే తక్కువ ఎత్తు, లేదా సమాంతరంగా ఉంటాయి. దీంతో వీటిని లోతట్టు తీరప్రాంతాలుగా చెప్తాం. సముద్రమట్టం పెరగాలంటే అది ఉన్న బేసిన్ ఏరియా, అందులో ఉన్న, చేరుతున్న నీటి పరిమాణం ప్రధానం. ఐపీసీసీ రిపోర్ట్ వందశాతం నిజమైతే, మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలకే ఎక్కువ ప్రమాదం. మిడ్ లాటిట్యూడ్‌లో ఉన్న భారత్ తీర ప్రాంత నగరాలకు అంతగా భయం లేదని అన్నారు. వాతావరణపరంగా మార్పు ప్రతి 30 ఏళ్లకోసారి సంభవిస్తుంది. దీనినే అట్మాస్ఫియర్ సైకిల్ అంటాం. ఐపీసీసీ రిపోర్టు దాదాపు మూడు సైకిల్స్ తర్వాత ఏం జరగబోతుందని చెప్తోంది. ఈ రిపోర్టు 2050 నాటి వరకైతే దీనిని పూర్తిగా ఏకీభవించవచ్చు.
కానీ, 2100నాటి పరిస్థితిని చెప్పడమంటే వందశాతం కరెక్ట్ అనలేం. గతంలో కూడా మాల్దీవులు మునిగిపోతుందనే నివేదికలు చాలా ఉన్నాయి. కానీ అలా జరగలేదు. ఐపీసీసీ అంచనాలుగా తీసుకుని లోతట్టు తీర ప్రాంతాలను పరిశీలన చేస్తే, రాబోయే ప్రమాదానికి ముందస్తు హెచ్చరికలుగా పనికొస్తాయి అని రామకృష్ణ చెప్పారు. కర్బన ఉద్గారాలు, ఉష్ణోగ్రతల పెరుగుదల ఇదే విధంగా కొనసాగితే 2040 నాటికి సరాసరి 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరుగుతుంది. ఈ శతాబ్దం చివరి నాటికి గరిష్ఠంగా 2 మీటర్లు, 2150 నాటికి 5 మీటర్ల వరకు సముద్రమట్టాలు పెరిగే అవకాశముందుని ఐపీసీసీ రిపోర్టులో పేర్కొంది. అవి అంత కచ్చితమైన గణాంకాలు కానప్పటికీ.. ఉష్ణోగ్రతలు, కాలుష్యం కంట్రోల్ చేయకపోతే, అది నిజమయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రిటైర్డ్ ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ అన్నారు.
సముద్రం ముందుకు రావడం అనేది విశాఖ తీరంలో సాధారణంగా కనిపిస్తుంది. దీని పై తరచూ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తుంటాయి. ఇదేమి ప్రమాదకరమైనది కాదని, స్థానిక వాతావరణ పరిస్థితులు, సముద్రంలో జరిగే అలజడులు, తీరం ఉన్న భౌగోళిక పరిస్థితులు బట్టి సముద్రం ముందుకు, వెనక్కు వెళ్లడం జరగుతుందని బే ఆఫ్ బెంగాల్ స్టడీస్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి. రామారావు తెలిపారు. విశాఖ నగరం సముద్ర మట్టం కంటే సగటున రెండు మీటర్లు వరకు ఎత్తులో ఉంది. పైగా విశాఖ తూర్పుకనుమలలో ఉంటుంది. ఇదే నగరానికి రక్షణ కోట. విశాఖలో ఏడాదికి సముద్రమట్టం 0.4 మి.మీ. మాత్రమే పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఈ నగరానికి సముద్రం నుంచి ముప్పు లేదు. తుపాను, సముద్రంలో తరచూ సంభవించే అతి స్వల్ప భూకంపాల ప్రభావం కూడా వీటిపై కనిపిస్తుంది. అంత మాత్రాన ఇవి త్వరలో మునిగిపోతాయని అర్థం కాదని ప్రొఫెసర్ రామారావు వెల్లడించారు.