Begin typing your search above and press return to search.
తెలంగాణ అప్పులు ఎంతో తెలిస్తే షాకే?
By: Tupaki Desk | 21 Dec 2021 10:28 AM GMTకరోనా కల్లోలం వచ్చాక అందరి ఉద్యోగ ఉపాధికి గండిపడింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడగా.. ఇంకొందరు తక్కువ జీతాలకు పనిచేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాల నుంచి దిగ్గజ పరిశ్రమల వరకూ కరోనా ధాటికి కుప్పకూలాయి. సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకూ దివాళా తీశారు. ఈ కరోనా కాలంలో అందరూ చేసింది అప్పునే.
అయితే ఆ అప్పు ప్రభుత్వాలకు కూడా బోలెడంత ఉంది. దేశంలోనే ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్రం కూడా భారీగానే అప్పు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రం లెక్కలతో పార్లమెంట్ లో చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది.
తెలంగాణ రాష్ట్రంపై రూ.2 లక్షల 37వేల 747 కోట్ల రుణభారం ఉందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి దేశీయ అప్పులు రూ.2,34,912 కోట్లు, విదేశీ అప్పులు రూ.2835 కోట్లు ఉన్నాయని వెల్లడించింది.
ఆర్బీఐ, విదేశీ ఆర్థిక సంస్థలు, రీఫైనాన్సింగ్ సంస్థలు గత ఐదేళ్లలో తెలంగాణకు ఇచ్చిన అప్పుల గురించి కాంగ్రెస్ ఎంపీ ఏ రేవంత్ రెడ్డి సోమవారం లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఐదేళ్ల నుంచి విదేశీ సంస్థలు తెలంగాణకు రుణాలు ఇవ్వలేదని కేంద్రమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. విదేశీ సంస్థల సహకారంతో చేపడుతున్న ప్రాజెక్టులకు గాను 2016-17 నుంచి 2020-21 వరకూ అదనపు కేంద్ర సహకారం కింద రుణాలు ఇవ్వలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి తెలిపారు. విదేశీ సంస్థల సహకారంతో చేపడుతున్న ప్రాజెక్టులకు గాను 2016-17 నుంచి 2020-21 వరకూ అదనపు కేంద్ర సహకారం కింద రుణాల రూపంలో రూ.2233.62 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
విదేశీ సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు గాను ఐదేళ్లలో వడ్డీ, అసలు కలిపి తెలంగాణ ప్రభుత్వం రూ.529.75 కోట్లు తిరిగి చెల్లించిందని కేంద్రమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2017-22 వరకూ అసలు మొత్తం రూ.382.22 కోట్లు, వడ్డీ 147.53 కోట్లు చెల్లించిందన్నారు. ఇంకా రూ. 529.24 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.