Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌కు జ‌గ‌న్ గుర్తుకు వ‌చ్చారా? ఆయ‌నే గుర్తు చేశారా...?

By:  Tupaki Desk   |   11 Feb 2022 6:30 AM GMT
టాలీవుడ్‌కు జ‌గ‌న్ గుర్తుకు వ‌చ్చారా?  ఆయ‌నే గుర్తు చేశారా...?
X
రాజకీయాల‌కు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే.. ప్ర‌భుత్వాల నుంచి వారు కోరుకున్న‌వి జ‌ర‌గాలంటే.. స‌ర్కారు విష‌యంలో వారు సాన‌నుకూలంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో పెద్ద‌గా ప్ర‌య‌త్నించ‌కుండానే... ఆయ‌న అనేక అనుమ‌తులు ఇచ్చేశారు.

అనేక మంది ద‌ర్శ‌కుల‌తోనే ఆయ‌న సంబంధాలు పెట్టుకుని.. ప్ర‌భుత్వంలో వారిని భాగ‌స్వా ములు చేశారు. సామాజిక వ‌ర్గం ప‌రంగా కూడా డామినేష‌న్ ఎక్కువ‌గా ఉన్న టాలీవుడ్‌లో చంద్ర‌బాబుకు ప్రాధాన్యం ఇచ్చేవారు.

అయితే.. అఖండ మెజారిటీతో.. విజ‌యం ద‌క్కించుకున్న జ‌గ‌న్‌ను టాలీవుడ్ ప‌ట్టించుకోలేదు. పైగా.. కేసీ ఆర్ ప్ర‌భుత్వాన్ని.. అక్క‌డి పాల‌న‌ను త‌ర‌చుగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వారు వీరు అనే తేడా లేకుండా.. అంద‌రూ.. కేసీఆర్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇది స‌హ‌జంగానే వైసీపీలో చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇంత మెజారిటీ సాధించినా.. టాలీవుడ్‌నుంచి ఒక్క‌రూ స్పందించ‌లేదు.. అనే ఆవేద‌న కూడా ఉంది. అయితే.. నాగార్జున స‌హా ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే.. జ‌గ‌న్‌తో భేటీ అవుతున‌న్నారు త‌ప్ప‌.. మిగిలిన వారు.. మాత్రం అంటీముట్ట‌న‌ట్టే ఉన్నారు.

ఈ క్ర‌మంలో టాలీవుడ్‌.. మ‌ద్ద‌తు.. ఇప్ప‌టికీ.. టీడీపీకి మాత్ర‌మే ఉంద‌ని.. ఆ పార్టీ నేత‌లు ప్ర‌చారం చేసుకు న్నారు. ఈ క్ర‌మంలో ఎక్క‌డ నొక్కితే.. టాలీవుడ్ బెంబేలెత్తుతుందో.. ఎక్క‌డ గిల్లితే.. శోక‌ణ్ణాలు పెడుతుందో .. అక్క‌డే జ‌గ‌న్ గిల్లారు. అంతే! ఇప్పుడు టాలీవుడ్ మొత్తం.. ప‌రుగులు పెట్టుకుంటూ.. తాడేప‌ల్లికి బారులు తీస్తోంది. రాజ‌కీయాల‌కు మాకు ప‌డ‌దు... అనుకున్న ప్ర‌భాస్‌, మ‌హేష్‌, కొర‌టాల శివ‌, రాజ‌మౌళి వంటి వారు కూడా తాడేప‌ల్లికి వ‌చ్చారు. గ‌తంలో నిర్మాత‌లు క్యూ క‌ట్టారు. అంతేకాదు.. జ‌గ‌న్ అధికారంలో వ‌చ్చి.. మూడేళ్లు అవుతున్నా.. ప‌ట్టించుకోని వారు..ఇప్పుడు జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు.

దీనిని బ‌ట్టి.. టాలీవుడ్‌ను జ‌గ‌న్ ఎలా దారికి తెచ్చుకున్నారో చూస్తే.. అర్ధ‌మ‌వుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది. కేవ‌లం త‌న‌ను పొగిడించుకునేందుకు మాత్ర‌మే జ‌గ‌న్ ప‌రిమితం కాలేదు.. టాలీవుడ్‌తో ఏపీకి ప్ర‌యోజ‌నాలు వ‌చ్చేలా కూడా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. 20 నుంచి 30 శాతం షూటింగులు ఏపీలో జ‌రిగేలా చ‌క్రం తిప్పారు.

మేం దిగివ‌చ్చేది లేద‌న్న వారిని వారంత‌ట వారే దిగి వ‌చ్చేలా చేశారు. మొత్తంగా చూస్తే.. ఇన్నాళ్ల‌కు టాలీవుడ్ ఏపీ అనేది ఒక‌టుంది! అనే విష‌యం గుర్తించేలా జ‌గ‌న్ చేశార‌ని.. నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.