Begin typing your search above and press return to search.

బాబు పేరెత్తితే ఒట్టు....టీడీపీకి అంత సీన్ లేదా...?

By:  Tupaki Desk   |   16 Nov 2022 9:10 AM GMT
బాబు పేరెత్తితే ఒట్టు....టీడీపీకి అంత సీన్ లేదా...?
X
ఏపీలో తెలుగుదేశం పార్టీ ది నాలుగు దశాబ్దాల చరిత్ర. ఇది పాజిటివ్ గా చెప్పుకుంటే నాణేనికి రెండవ వైపు ఏంటి అంటే టీడీపీ పాతకాలం పార్టీ అని. ఆ పార్టీని జనాలు ఎన్నో సార్లు ఎన్నుకున్నారు. సీఎం గా చంద్రబాబు పాలనను చూసి ఉన్నారు. మరో వైపు టీడీపీ 2019 ఎన్నికల తరువాత బలపడిందా బలహీనపడిందా అంటే దేనికీ కచ్చితమైన ఆధారాలు అయితే లేవు.

దీంతో పాటు చంద్రబాబు చేస్తున్న ఔట్ డేటెడ్ పాలిటిక్స్ కూడా ఆ పార్టీకి ఇబ్బందిగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో యూత్ ఓట్లు అత్యంత కీలకం. యువత ఓట్లను ఎక్కువ శాతం తన వైపునకు తిప్పుకోవడంలో పవన్ కళ్యాణ్ జనసేన ముందు వరసలో ఉంది అంటున్నారు. ఇక ఆ పార్టీ మీద ఫోకస్ పెట్టి విమర్శలు చేస్తూ వస్తున్న వైసీపీ యువ ఓట్లలో తమ వాటాను కూడా పదిలం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

ఈ నేపధ్యంలో ఎక్కువగా జనసేన మీదకే తన గురి పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వేసుకుంటున్న అంచనాలు తీసుకుంటే జనసేన నుంచే ఎక్కువ ముప్పు ఉందని ఊహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీకి ముప్పతిప్పలు పెట్టేలా పవన్ కళ్యాణ్ యువ ఓటర్ల ఆసరాతో దూకుడు చేస్తున్నారు అని గ్రహించే టార్గెట్ పవన్ అన్న విధానాన్ని వైసీపీ అవలంబిస్తోంది అంటున్నారు.

మరో వైపు చూస్తే ఈ మధ్య కాలంలో ఎక్కడా టీడీపీని పెద్దగా వైసీపీ విమర్శించడంలేదు అని అంటున్నారు. వైసీపీ విషయానికి వస్తే కావాలనే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో పవన్ పార్టీ పెరుగుతోందని, కొత్త పార్టీగా జనాలకు ఆ వైపుగానే ఆకాంక్షలు ఎంతో కొంత పెరిగే అవకాశం ఉందని కూడా లెక్కలేసుకుంటున్నారు.

ఇక టీడీపీ విషయం చూస్తే అనవసరంగా తాము విమర్శలు చేస్తూ పోతే ఆ పార్టీని కోరి పెంచినట్లు అవుతుందని కూడా వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో టీడీపీ కూడా అనుకున్నంత స్థాయిలో ఎదగకపోవడమే వైసీపీ ఆ వైపుగా దృష్టి పెట్టకపోవడానికి కారణం అని అంటున్నారు.

ఇప్పటంలో పవన్ కళ్యాణ్ టూర్ చేస్తే వైసీపీ ఒక రేంజిలో ఫైర్ అయింది. ఆయన మీద మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా అంతా కూడా ఒక్కసారిగా మీదన పడిపోయారు. అదే ఇప్పటానికి తరువాత రోజున లోకేష్ కూడా వెళ్లారు. ఆయన కూడా తీవ్రమైన విమర్శలే చేశారు. అయితే వాటిని మాత్రం వైసీపీ లైట్ తీసుకుంది. ఈ రెండు ఘటనలలో వైసీపీ వ్యవహరించిన తీరు చూస్తేనే అర్ధమవుతోంది ఆ పార్టీ టీడీపీ విషయంలో ఎలా వ్యవహరిస్తోందో చెప్పడానికి అంటున్నారు.

అదే విధంగా చంద్రబాబు చేస్తున్న విమర్శలను కూడా ఈ మధ్య టీడీపీ పెద్దగా ఖండించడంలేదు. బాబు చేసే కామెంట్స్ కి జవాబు చెప్పే పని ఒక్క కొడాలి నాని మాత్రమే చేస్తున్నారు. అది కూడా అవసరం అయితీనే తప్ప ఆయన బయటకు రావడంలేదు. దాంతో ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మారింది అని వైసీపీ భావిస్తోందా లేక తెలుగుదేశం పార్టీ బలం మీద ఒక కచ్చితమైన అంచనాకు వచ్చేసిందా అన్నది మాత్రం ఆసక్తికరమైన చర్చగా ఉంది.

ఏపీలో పెదబాబు, చినబాబుల విమర్శలకే పట్టించుకోకపోతే అపుడు ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని గుర్తించడం లేదా అన్న డౌట్ కూడా వస్తోంది. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలో కొత్త ఎత్తులతో వ్యూహాలతో వైసీపీ ముందుకు సాగుతోంది అని చెప్పాలి. ఇక దీని వెనక మరో బలమైన కారణం కూడా ఉంది అంటున్నారు. వచ్చే ఏడాది మొదట్లో లోకేష్ భారీ పాదయాత్రలు సిద్ధపడుతున్నారు.

ఆయన కచ్చితంగా జగన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకు సాగుతారు. లోకేష్ పాదయాత్రకు హైప్ రాకుండా ఉండాలన్నా టీడీపీ గ్రాఫ్ ఆ విధంగా ఏ మాత్రం పెరగకుండా ఉండాలన్నా కూడా ఆ పార్టీ పట్ల సైలెంట్ గా ఉంటేనే బెటర్ అన్న విధానంలో వైసీపీ ఉంది అంటున్నారు. జనసేన వర్సెస్ వైసీపీగా ఏపీ రాజకీయాన్ని మారిస్తే తమకే లాభం అన్న లెక్కలేవో వేసుకుంటున్నారు అని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.