Begin typing your search above and press return to search.
ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా? కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి
By: Tupaki Desk | 14 March 2021 5:30 AM GMTవిమాన ప్రయాణం ఇప్పుడు మామూలైంది. మధ్య తరగతి వారు సైతం తరచూ విమాన ప్రయాణాల్ని అమితంగా ఇష్టపడుతున్నారు. ప్రయాణ సమయం తక్కువగా ఉండటం.. టికెట్ ఖర్చులు తగ్గిపోవటంతో పాటు.. కరోనా వేళ భద్రతకు సంబంధించిన విషయాల్లోనూ మిగిలిన ప్రజారవాణాతో పోలిస్తే.. ఇదే బెటర్ అప్షన్ అన్న భావన పలువురిలో పెరుగుతోంది. దీనికి తగ్గట్లే.. విమాన ప్రయాణ రద్దీ లాక్ డౌన్ తర్వాత త్వరగానే పుంజుకుంది. మరోసారి దేశంలో కరోనా కేసుల తీవ్రత అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. కొత్త నిబందనల్ని తీసుకొచ్చింది.
కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సం(డీజీసీఏ) జారీ చేసిన తాజా రూల్ ప్రకారం.. విమాన ప్రయాణంలో కొత్త నిబంధనల్ని విధిగా పాటించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. మాస్కు విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. నిర్లక్ష్యం వహించినా.. అనవసర వాదనలకు దిగినా.. విమాన ప్రయాణ నిషేధిత జాబితాలో పేరు నమోదు కావటం ఖాయమంటున్నారు. తాజాగా జారీ చేసిన ఆదేశాల్ని చూస్తే.. మాస్కుకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నారు ఇట్టే అర్థమవుతుంది.
కొత్త నిబంధనలు
- విమాన ప్రయాణ సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
- సామాజిక దూరం పాటించటం చాలా ముఖ్యం.
- ముక్కు కిందకు మాస్కుల్ని పెట్టుకోకూడదు. మాస్కును సరిగా ధరించాలి.
- ఎయిర్ పోర్టు ఎంట్రీ వద్ద ప్రయాణిఖుల్ని భద్రతా సిబ్బంది నిశితంగా పరిశీలించాలి. మాస్క్ లేకుండా ఎయిర్ పోర్టు లోపలకు ఎవర్నీ అనుమతించొద్దు.
- ఎయిర్ పోర్టులో ప్రతి ఒక్కరు మాస్కు ధరించేలా.. సామాజిక దూరం పాటించేలా ఎయిర్ పోర్టు డైరెక్టర్ లేదా టర్మినల్ మేనేజర్ చూసుకోవాలి.
- ఏ ప్రయాణికుడైనా కోవిడ్ 19 నిబంధనల్ని పాటించకపోతే వారిని భద్రతా సిబ్బందికి అప్పజెప్పాలి.
- ఫ్లైట్ ఎక్కిన తర్వాత అందరూ మాస్క్ లు పెట్టుకునేలా చూసుకోవాలి.
- విమాన సిబ్బంది హెచ్చరించిన తర్వాత కూడా మాస్కు పెట్టుకోకపోతే ఆ ప్రయాణికుల్ని టేకాఫ్ కు ముందు విమానం నుంచి దించేయాలి.
- ప్రయాణ సమయంలో ఫ్లైట్ లో కోవిడ్ నిబంధనల్ని పదే పదే ఉల్లంఘిస్తే వారిని నిషేధిత జాబితాలోని ప్రయాణికుడిగా పరిగణించాలి.
- అలాంటి వారిపై విమానయాన సంస్థ చట్టపరమైన చర్యలు తీసుకునే వీలుంది.