Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ కు దమ్ములేదు:డొక్కా
By: Tupaki Desk | 4 Jun 2018 12:08 PM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ నేతలు కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నారని, టీడీపీపై విమర్శలు గుప్పించడం వెనుక బీజేపీ హస్తముందని ఆరోపిస్తున్న విషయం విదితమే. తనను తిట్టడమే పవన్ కల్యాణ్ పనిగా పెట్టుకున్నారని సీఎం చంద్రబాబు కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ - బీజేపీలపై టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ నిప్పులు చెరిగారు. పవన్ ను ఉద్దేశించి డొక్కా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రాన్ని విమర్శించి - ప్రశ్నించే దమ్ము పవన్ కు లేదన్నారు. జనసేన ఓ దగాకోరు పార్టీ అని డొక్కా అన్నారు. చంద్రబాబును - లోకేష్ ను నిత్యం విమర్శించటం, తిట్టడమే పవన్ పని అని ఎద్దేవా చేశారు. బీజేపీ నిపా వైరస్ అని - ఏపీకే కాకుండా దేశంలోని ఏ రాష్ట్రానికి బీజేపీతో అవసరం లేదన్నారు. రాబోయే ఎన్నికట్లో బీజేపీ - జనసేనలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. బీజేపీ విలువలను వదిలేసిందని - ఆ పార్టీ .... రాష్ట్రాల హక్కులను హరిస్తోందని దుయ్యబట్టారు.
అయితే, నాలుగేళ్లుగా బీజేపీ - జనసేనలతో అంటకాగిన టీడీపీ నేతలు.....హఠాత్తుగా బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రాన్ని విమర్శించే దమ్ము పవన్ కు లేదంటోన్న టీడీపీ నేతల దమ్ము ఎంతని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హోదా ఇవ్వబోమని....ప్యాకేజీ తీసుకోవాలని కేంద్రం ఇచ్చిన ఆఫర్ ను ఎగిరి గంతేసి స్వీకరించిన టీడీపీ నేతలకు .....బీజేపీని విమర్శించే హక్కు లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. హోదాపై కేంద్రం తీరుకు నిరసనగా వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే....టీడీపీ ఎంపీలు చోద్యం చూశారు. అటువంటి వారు దమ్ముగురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఓ పక్క లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడుపుతున్నారంటూ ప్రగల్భాలు పలుకుతోన్న టీడీపీ నేతలు....పబ్లిక్ గా బట్టబయలైన టీడీపీ నేతల భూదందాల గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. గురివింద నలుపు లెక్క...తమ పార్టీలోని ఎమ్మెల్యేలు - మంత్రులు పాల్పడుతోన్న అవినీతి టీడీపీ నేతలకు కనబడదు కాబోలు. ఏదేమైన, ఇతరులపై టీడీపీ నేతల విమర్శలు....దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.