Begin typing your search above and press return to search.
కిరికిరి కిరణ్..చిరు సీఎం కావాలని లేఖ
By: Tupaki Desk | 22 Aug 2015 8:35 AM GMTకాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి షష్ఠి పూర్తి సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన డొక్కా అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం రోశయ్యను తప్పించి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావించినప్పుడు తాను కాంగ్రెస్ అధిష్ఠానానికి మెగాస్టార్ చిరంజీవిని సీఎం చేయాలంటూ లేఖ రాశానని చెప్పారు.
అప్పటి దాకా స్పీకర్‌గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేయవద్దని..ఆయన పచ్చి మోసగాడని అధిష్ఠానానికి రాసిన లేఖలో తాను పేర్కొన్నట్టు డొక్కా చెప్పారు. అదే లేఖలో తాను చిరంజీవిని సీఎం చేయాలని సోనియాకు సూచించానని...కిరణ్ స్థానంలో చిరు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యి ఉంటే రాష్ర్టంలో కాంగ్రెస్ ఈ దుస్థితిలో ఉండేది కాదని డొక్కా తెలిపారు.
ఇంతకు సడెన్ గా ఇప్పుడు డొక్కాకు చిరుపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అర్థం కావడం లేదు. ఆయన ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం రాసిన లేఖను ఇప్పుడు ప్రస్తావించి మరీ కిరణ్‌కుమార్ రెడ్డిపై తనకున్న కోపాన్ని కక్కేశారు. కిరణ్ జిల్లాలో ఎప్పుడూ మరో మంత్రి కన్నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి డొక్కాను చాలాసార్లు అవమానించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే డొక్కా కిరణ్ పై ఈ స్థాయిలో ఫైర్ అయ్యారని టాక్.
తాడికొండ నుంచి రెండుసార్లు కాంగ్రెస్ తరపున ఎన్నికైన డొక్కా వైఎస్, రోశయ్య, కిరణ్ పాలకవర్గాల్లో మంత్రిగా పనిచేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన వైకాపాలో చేరేందుకు సిద్ధమైన తన గురువు రాయపాటి సూచన మేరకు ఆగిపోయారు. త్వరలోనే డొక్కా టీడీపీ గూటికి చేరుకుంటారని.... ఈ మేరకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.