Begin typing your search above and press return to search.

రాజ‌ధానిలో టీడీపీ ర‌గ‌డ‌..మాజీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎమ్మెల్సీ

By:  Tupaki Desk   |   2 Nov 2019 1:30 AM GMT
రాజ‌ధానిలో టీడీపీ ర‌గ‌డ‌..మాజీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎమ్మెల్సీ
X
ప్ర‌తిప‌క్ష టీడీపీలో వింత రాజ‌కీయం జ‌రుగుతోంది. ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ రెండో సారి అధికారంలోకి రావ‌డం అటుంచి.. వైసీపీ దెబ్బ‌తో దిక్కులు చూస్తోంది. ఓట‌మి ఒక విధంగా పార్టీని ఇరుకున పెడితే.. ఇప్పుడు నాయ‌కుల జంపింగుల‌తో పార్టీ మ‌రింతగా ఇబ్బంది ప‌డుతోంది. మ‌రి ఈ నేప‌థ్యంలో పార్టీ ని బ‌తికించుకునేందుకు - పార్టీని లైన్‌ లో పెట్టేందుకు సీనియ‌ర్లు ఒళ్లు దాచుకోకుండా క‌ష్ట‌ప‌డాల‌ని పార్టీ అధి నేత చంద్ర‌బాబు పిలుపునిస్తున్నారు. అయితే, బాబు మాట‌ల‌ను ఎంత‌మంది అందిపుచ్చుకుంటున్నా రు? ఎంత‌మంది పార్టీ కోసం కృషి చేస్తున్నారు? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

స‌రే! ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. కొంద‌రునాయ‌కులు త‌మ త‌మ వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం పార్టీని మ‌రింత గా రోడ్డున ప‌డేస్తున్నారు. ఆధిప‌త్య పోరులో రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారు. పార్టీని బ‌జారుకు ఈడుస్తున్నారు. ముఖ్యంగా పార్టీకి ప‌ట్టున్న రాజ‌ధాని జిల్లా గుంటూరులోనే ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డంతో టీడీపీ అభిమానులు - సానుభూతి ప‌రులు కూడా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గుంటూరులోని తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా మాజీ ఎమ్మెల్యే - ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఇద్ద‌రు టీడీపీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న ఆధిప‌త్య పోరు తీవ్రంగా మారింది.

2004 - 2009 ఎన్నిక‌ల్లో తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావు విజ‌యం సాధించారు. ఈయ‌న సీనియ‌ర్ మోస్ట్ రాజ‌కీయ నేత రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఆశీస్సుల‌తో అరంగేట్రం చేసిన ఎస్సీ నాయ‌కుడు. అయితే, 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌పున తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేసి విజ‌యం సాధించారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్‌ ను ప్ర‌జలు తిర‌స్క‌రించడంతో డొక్కా ఆ పార్టీ నుంచి జంప్ చేసి టీడీపీలోకి చేరిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. ఇక‌, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో డొక్కా .. తాడికొండ టికెట్‌ పై క‌న్నేశారు.

తాను ఇక్క‌డ నుంచి రెండు సార్లు విజ‌యం సాధించి కాంగ్రెస్ హ‌యాంలో మంత్రిగా కూడా విజ‌యం సాధించాను కాబ‌ట్టి.. త‌న‌కే ఇక్క‌డ టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఈ క్ర‌మంలో శ్రావ‌ణ్‌ పై ఆయ‌న కొంద‌రితో ఆరోప‌ణ‌లు అప్ప‌ట్లోనే చేయించారు. ఈ క్ర‌మంలో శ్రావ‌ణ్‌ ను బాప‌ట్ల ఎంపీ సీటుకు మార్చిన చంద్ర‌బాబు త‌ర్వాత కార్య‌క‌ర్త‌ల ఒత్తిడితో ఆయ‌న‌ను తిరిగి తాడికొండ‌లోనే పోటీ చేయించారు. ఈ క్ర‌మంలో డొక్కాను ప్ర‌త్తిపాడుకు పంప‌డం తెలిసిందే. అయితే, డొక్కా - శ్రావ‌ణ్ ఇద్ద‌రూ కూడా జ‌గ‌న్ సునామీతో ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో డొక్కా.. వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. త‌న‌కు తాడికొండే కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్న ఆయ‌న శ్రావ‌ణ్‌పై వ్య‌తిరేక ప్ర‌చారం చేయిస్తున్నారు.

నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలకు శ్రావణ్ కుమార్ అందుబాటులో ఉండటంలేదని ప్రచారం సాగుతోంది. చంద్రబాబుతో పాటు లోకేష్ వద్దకు ఈ ప్ర‌చారం చేరేలా చెయ్యడంలో డొక్కా సక్సెస్ అయినట్లు టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి డొక్కా మాణిక్యవరప్రసాద్ అయితేనే - మళ్లీ క్యాడరును బలోపేతం చేయగలరంటూ తన అనుచరులతో పాజిటివ్‌గా అధినేత దగ్గర చెప్పించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న శ్రావణ్ వర్గీయులు డొక్కా తీరుపై మండిపడుతున్నారు. శ్రావణ్‌ పై త‌ప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడుతున్నారు. అసలు డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పెద్దగా పాల్గొనడంలేదంటున్నారు. తాడికొండపై ఆధిపత్యం కోసం ఇద్దరు నాయకుల ఫిర్యాదులతో నియోజకవర్గంలో అలజడి రేగుతోంది.