Begin typing your search above and press return to search.
డోక్లాం మాదే.. ఇండియా పని చూసుకో
By: Tupaki Desk | 26 March 2018 6:57 PM GMTపొరుగు దేశం చైనా సద్దుమణిగిన విధానిన్ని మళ్లీ కెలుకుతోంది. భారత్ సంయమనాన్ని పరీక్షిస్తోంది. సరిహద్దులో ఉన్న డోక్లా విషయంలో ఇండియాను కవ్వించే వ్యాఖ్యలు చైనా మరోసారి చేసింది. డోక్లాం తమదేనని - గతేడాది రేగిన వివాదంతో ఇండియా గుణపాఠం నేర్చుకోవాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు. డోక్లాం వివాదానికి చైనానే కారణమని చైనాలో భారత రాయబారి గౌతమ్ బాంబావాలె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సరిహద్దులో యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తే డోక్లాంలాంటి వివాదాలు చెలరేగుతూనే ఉంటాయని హాంకాంగ్ కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత రాయబారి గౌతమ్ అన్నారు. ప్రస్తుతానికి డోక్లాం ప్రాంతంలో ఎలాంటి మార్పు లేదని - చైనా బలగాలు ఆ ప్రాంతానికి చాలా దూరంలోనే ఉన్నాయని ఆయన చెప్పారు.
భారత రాయబారి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. డోక్లాం తమదేనని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు. యథాతథ స్థితిని మార్చడం అంటూ ఏదీ లేదని - అక్కడ చైనా కార్యకలాపాలు తమ సార్వభౌమాధికార హక్కులకు లోబడే జరుగుతున్నాయని చున్యింగ్ చెప్పారు. `మా కృషి వల్లే గతేడాది వివాదం ముగిసింది. దీన్నుంచి ఇండియా పాఠాలు నేర్చుకుంటుందని భావిస్తున్నాం. సరిహద్దులో శాంతియుత వాతావరణం కొనసాగేలా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవడానికి భారత్ కృషి చేయాలి` అని ఆమె స్పష్టం చేశారు.