Begin typing your search above and press return to search.
గుట్కా ప్యాకెట్లలో వెల్లువెత్తిన డాలర్ నోట్లు..!
By: Tupaki Desk | 10 Jan 2023 11:08 AM GMTఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులను మస్కా కొట్టించేందుకు కేటుగాళ్లు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. షర్టు బటన్స్.. సూట్ కేస్ హ్యాండిల్.. అండర్ వేర్.. పాదరక్షలల్లో మాదక ద్రవ్యాలు.. బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ తరహాలోనే ఓ వ్యక్తి గుట్కా ప్యాకెట్లలో ఏకంగా అమెరికన్ డాలర్లు ఆ దేశానికి తరలించే క్రమంలో ఎయిర్ పోర్టు సిబ్బందికి అడ్డంగా బుక్కయ్యాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం రోజు బ్యాంకాక్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. భారీ లగేజ్ తో కన్పించిన సదరు వ్యక్తిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయగా ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది.
ఆ వ్యక్తి లగేజీలో ట్రాలీ సుట్ నిండా గుట్కా ప్యాకెట్లు అధికారులకు కన్పించాయి. వీటిలో ఒక దానిని చింపి చూడగా అందులో ఒక ప్యాకెట్లో గుట్కా పౌడర్ కన్పించింది. మరో ప్యాకెట్ చించగా అందులో చక్కగా చుట్టబడిన పేపర్ ఉంది. దీనిని తెరిచి చూడగా పది రూపాయల అమెరికన్ డాలర్ నోటు కన్పించింది. దీంతో వాటన్నింటిని అధికారులు చించి తనిఖీ చేశారు.
వీటిలో మొత్తంగా 40 వేల అమెరికన్ డాలర్ల కరెన్సీ అధికారులకు లభ్యమైంది. దీని విలువ మన కరెన్సీలో రూ.32 లక్షల 78 వేలు ఉండనుంది. దీంతో సదరు వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కోలకత్తా కస్టమ్స్ అధికారులు తమ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.
కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం భారతీయులు విదేశాలకు వెళ్లే సందర్భంలో గరిష్టంగా రూ.25 వేల రూపాయల నగదును తీసుకెళ్లవచ్చు. వీటితోపాటు మరో 3వేల డాలర్లు మాత్రమే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మిగిలిన నగదు మాత్రం కార్డులు, ఫారెక్స్ కార్డులకు లేదా ట్రావెలర్స్ చెక్కుల రూపంలో మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. భారీ మొత్తంలో నగదు తీసుకెళ్లే అవకాశం ఉండదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.