Begin typing your search above and press return to search.

అమెరికాలో భారతీయ విద్యార్థుల ఆధిపత్యం

By:  Tupaki Desk   |   30 Jun 2021 11:30 AM GMT
అమెరికాలో భారతీయ విద్యార్థుల ఆధిపత్యం
X
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు అమెరికన్ల కంటే కూడా ఇతర దేశాలకు చెందిన సంతతే అత్యంత ప్రభావం చూపుతున్నారంటే అతిశయోక్తి కాదు.. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ను నడిపించేంది మన భారతీయుడు, తమిళనాడుకు చెందిన సుందర్ పిచ్చై. ఇక మరో టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా మన తెలుగు బిడ్డ సత్యనాదెళ్ల. అమెరికాకు వెళ్లిన ఇండియన్లు, చైనీయులు ఇప్పుడక్కడ వ్యవస్థలను శాసించేలా.. వినూత్న ఆవిష్కరణలు చేసేలా ఎదుగుతున్నారంటే అతిశయోక్తి కాదు.

అమెరికాలో జరిగే శాస్త్ర సాంకేతిక అంశాల్లో, కొత్తవి కనిపెట్టడంలో.. ఆవిష్కరణలో భారతీయ సంతతి అమెరికన్లు ముందుంటున్నారు. మన చిన్నారులు అయితే అమెరికాలో దున్నేస్తున్నారు.

అమెరికాలో ప్రతి ఏటా జరిగే ప్రఖ్యాత స్పెల్లింగ్ బీ పోటీల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ పోటీలు ఈ సంవత్సరం నిర్వహించారు. ఈ ‘స్పెల్లింగ్ బి’ పోటీల్లో 11 మంది ఫైనల్స్ కు చేరితే అందులో 9 మంది భారతీయ అమెరికన్ చిన్నారులే ఉండడం మన వాళ్ల ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు.

ఈ స్పెల్లింగ్ బీ ఫైనల్స్ తాజాగా ఫ్లోరిడాలోని ఒర్లాండ్ సమీపంలో ఉన్న వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్ లో జూలై 8వ తేదీన నిర్వహించబడుతాయి.

ఈ పోటీకి మొత్తం 209 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. చివరకు 11 మంది మాత్రమే ఫైనల్స్ చేరారు. ఈ పోటీల్లో కేవలం అమెరికాలో ఒక శాతం జనాభా ఉన్న భారతీయ అమెరికన్ల హవా కొనసాగిందంటే మన చిన్నారులు ఏ స్థాయిలో చదువుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అమెరికా పిల్లలను వెనక్కి నెట్టి ముందంజ వేస్తున్నారు.

గత 20 ఏళ్లుగా అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతూనే ఉంది. ఈ పోటీల్లో కూడా అది ప్రస్ఫూటంగా కనిపిస్తోంది. 2019లోనూ జరిగిన ఈ పోటీల్లో 8 మంది కో చాంపియన్స్ లో ఏడుగురు మన భారతీయ అమెరికన్ పిల్లలే కావడం మనకు గర్వకారణం.