Begin typing your search above and press return to search.

మోడీపై ప్రేమను మరోసారి బయటపెట్టిన డొనాల్డ్ ట్రంప్

By:  Tupaki Desk   |   8 Sep 2022 10:35 AM GMT
మోడీపై ప్రేమను మరోసారి బయటపెట్టిన డొనాల్డ్ ట్రంప్
X
భారత ప్రధాని నరేంద్రమోడీ ఏ దేశానికి వెళ్లి ఆ దేశ ప్రధాని/అధ్యక్షుడితో స్నేహం చేస్తాడా? వాళ్ల పని మటాషే. ఎందుకంటే ఆయన హ్యాండ్ అలాంటిది. భస్మాసుర హస్తంలాగానే వాళ్ల పదవులు అన్నీ కోల్పోతారు. పాకిస్తాన్ ప్రధానిగా చేసిన ఇమ్రాన్ ను పలకరించాడు ఆయన పోస్ట్ ఊడింది. ఇక జపాన్ ప్రధానితో స్నేహం చేశాడు. పాపం ఆయన కాల్పుల్లో పోయాడు. అమెరికా వెళ్లి మరీ డొనాల్డ్ ట్రంప్ తరుఫున ప్రచారం చేశాడు ఆయన ఓడిపోయాడు. ఇక బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో రాసుకుపూసుకు తిరిగాడు. ఆయన గద్దె దిగాల్సి వచ్చింది.

అమెరికాలో నిర్వహించిన 'హౌడీ మోడీ' కార్యక్రమంలో భారత ప్రధాని మోడీ పాల్గొని ఏకంగా భారతీయులంతా ట్రంప్ కు సపోర్టు చేయాలని.. ఆయననే గెలిపించాలని పిలుపును ఇచ్చారు. అయితే మోడీ ప్రచారం చేసినా కూడా అక్కడ ట్రంప్ గెలవలేకపోయారు. ట్రంప్ తీసుకున్న వివాదాస్పద, నిర్లక్ష్య , జనాల వ్యతిరేక నిర్ణయాలే ఆయన కొంప ముంచాయి.

మోడీ ఇలా ఎవరికి హ్యాండ్ ఇస్తే.. ఆ దేశ ప్రజలు వారికి హ్యాండిస్తున్నారు. ఇంత జరిగినా మోడీపై ప్రేమ మాత్రం డొనాల్డ్ ట్రంప్ లో చావలేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా మోడీపై ప్రేమను మరోసారి చాటుకున్నాడు డొనాల్డ్ ట్రంప్.

భారత ప్రధాని నరేంద్రమోడీ అద్భుతంగా పనిచేస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించడం సంచలమైంది. మోడీతో తనకు మంచి అనుబంధముందని.. ఆయన దేశం కోసం చేస్తున్న కృషి చాలా కష్టమైందన్నారు.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అందరూ నన్ను పోటీచేయాలని అనుకుంటున్నారని.. ఎన్నికల్లో నేనే ముందున్నానని.. త్వరలోనే ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోగానే నెటిజన్లు అందరూ ఆయన జిగ్రీ దోస్త్ అయిన భారత ప్రధాని నరేంద్రమోడీపై పడిపోయారు.. సోషల్ మీడియాలో'మీమ్స్, ట్రోల్స్ ' మొదలుపెట్టారు. 'ట్రంప్ గాన్.. మోడీ నెక్ట్స్' అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని.. పెట్రోల్, నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగాయని.. వచ్చే ఎన్నికల్లో మోడీకి ఓటమి తప్పదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ ట్రంప్, మోడీ స్నేహం మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.