Begin typing your search above and press return to search.
మోడీకి శుభాకాంక్షలు..భారత్ కు షాక్..ట్రంప్ కొత్త థియరీ
By: Tupaki Desk | 2 Jun 2019 7:07 AM GMTఅమెరికాకు భారత్ గొప్ప మిత్ర దేశమని - ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సిద్ధమని కాషాయ పార్టీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా స్వల్ప వ్యవధిలోనే తమ మాట మార్చేసింది. భారత్‌కు ఇన్నాళ్లూ కల్పించిన ప్రాధాన్యతా వాణిజ్య హోదాను రద్దు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారత్‌కు ఉన్న వాణిజ్య హోదాను రద్దు చేయరాదంటూ అమెరికా ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను కూడా ట్రంప్ పట్టించుకోలేదు. గతంలో ఇచ్చిన 60 రోజుల నోటీసు సమయం దాటిపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఇది అమలులోకి రానున్నది.
జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్(జీఎస్ పీ) ప్రోగ్రామ్ నుంచి భారత్‌ను తొలగించాలన్న అభిప్రాయాన్ని ట్రంప్ గతంలోనే వెల్లడించారు. ప్రాధాన్యతా వాణిజ్య హోదా కింద ఇన్నాళ్లూ భారత వస్తువులకు అమెరికాలో ప్రత్యేక పన్నులు ఉండేవి కావు. అయితే తమ వస్తువులకు సమాన హోదా ఇచ్చే అంశంపై భారత్ ఇంత వరకు ఎటువంటి హామీ ఇవ్వలేదని, అందుకే జూన్ 5వ తేదీ నుంచి ప్రిఫరెన్షియల్ బెనిఫిషియరీ హోదాను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. భారత్ కు ప్రాధాన్య వాణిజ్య హౌదా(జీఎస్పీ) తొలగింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ సర్కార్ పునరుద్ఘాటించింది. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అఖండ విజయానికి శుభాకాంక్షలు తెలిపిన అమెరికా.. మోడీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.
అమెరికా వస్తువులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందన్నది ట్రంప్ వాదన. అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్ లలో అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై భారత్ నుంచి ఎటువంటి భరోసా లభించకపోవడం వల్ల భారత్ కు ప్రాధాన్య వాణిజ్య హౌదా రద్దు చేయాలని మార్చిలో కాంగ్రెస్‌కు ట్రంప్ లేఖ రాశారు. ఆ గడువు ముగిసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న కొన్ని వాణిజ్య చిక్కులను పరిష్కరించుకోగలిగితే కొన్ని రాయితీలు కల్పించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అధికారులు తెలిపారు. దీనిపై ఇరు దేశాలు విస్తృత చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉండగా - జీఎప్పీ తొలగింపు వల్ల భారత్ ఎగుమతులపై పెద్దగా ప్రభావం ఉండదని భారత్ లోని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ జీఎస్పీలో భాగంగా ఉండటంతో 2017లో 5.6బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. వచ్చేనెలలో ఒసాకాలో జీ-20 సభ్య దేశాల సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - భారత ప్రధాని మోడీ కూడా హాజరు కానున్నారు. ఈ సదస్సులో ఇరుదేశాధినేతలు ఈ అంశంపై చర్చించే అవకాశముంది. ఈ భేటీలో ఓ స్పష్టత రానుందని సమాచారం.