Begin typing your search above and press return to search.
ట్రంప్ ముందే ఆ మహిళ అలా...
By: Tupaki Desk | 28 Feb 2017 1:23 PM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనే ఇన్నాళ్లు విమర్శలు గుప్పుమంటుండగా తాజాగా ఆయన టీం మెంబర్లపై సైతం ఇదే రీతిలో వాగ్భానాలు సంధిస్తున్నారు. తాజాగా ఆయన సన్నిహితురాలు చేసిన పని వివాదంలో పడింది. ట్రంప్ తన ఓవల్ ఆఫీస్ లో ఉన్నారు.. ఆ సమయంలో దేశంలోని నల్లజాతీయుల కాలేజీలు - యూనివర్సిటీల ప్రతినిధులు కూడా అక్కడే ఉన్నారు. అందరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అదే సమయంలో ఓ మహిళ అక్కడే ఉన్న సోఫాపై కాళ్లకున్న షూ కూడా తీయకుండా.. మోకాళ్లపై కూర్చుంది. ఆమె ఎవరో కాదు ట్రంప్ సీనియర్ అడ్వైజర్ కెలియాన్ కాన్వే.
ట్రంప్ సీనియర్ అడ్వైజర్ అయిన కాన్వే అలా ఇబ్బందికరంగా కూర్చున్న సమయంలో ఏఎఫ్‌పీ ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నది. ట్విట్టర్‌లో చాలా మంది ఆమె తీరును ఎండగడుతున్నారు. ఇది కచ్చితంగా అక్కడున్నవారిని అవమానించడమే అవుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు. ట్రంప్ టీమ్ మర్యాదలు ఎలా ఉన్నాయో ఈ ఫొటో చూస్తేనే తెలుస్తుందని ఒకరు కామెంట్ చేశారు. ముఖ్యంగా అక్కడున్నది నల్లజాతి విద్యాసంస్థల ప్రతినిధులు కావడంతో కెలియాన్ చర్యపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. సోమవారం ఏఎఫ్ పీ ఈ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేయగా.. 1700కుపైగా రీట్వీట్లు - 1600 లైక్స్ - 1400 రిప్లైలు వచ్చాయి. ఈ ఫొటోపై యూఎస్ ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్ చీఫ్ తీవ్రంగా మండిపడ్డారు. వైట్ హౌజ్ వెంటనే దీనిపై విచారణ జరిపి, ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/