Begin typing your search above and press return to search.
అమెరికా ఎన్నికల్లో ముందస్తు పోలింగ్ రిజల్ట్
By: Tupaki Desk | 4 Nov 2016 8:02 AM GMTఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో జరగనున్నాయి. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమెరికా వైపే చూస్తోంది. అయితే, దీనికి ముందు నిర్వహించిన ముందస్తు ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ - డెమొక్రాటిక్ అభ్యర్థి - మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. వాస్తవానికి తొలి నుంచి ఇద్దరి మధ్యా పోటీ వాతావరణం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, మధ్యలో ట్రంప్ నోటి దురుసు - వివాదాస్పద వ్యాఖ్యలతో ఒకింత ఆయన వెనుకబడ్డారు. కానీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పోటీ నువ్వా - నేనా అన్నంత వరకు వచ్చేసింది.
ఇప్పటి వరకు దాదాపు మూడు కోట్ల మంది ముందస్తు ఎన్నికల్లో పాల్గొన్నారు. నార్త్ కరొలినా - నెవడా - కొలరాడో -అయోవా - అరిజోనా - ఫ్లోరిడా - ఓహియా రాష్ట్రాల్లో ఈ ముందస్తు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఎక్కువగా హిల్లరీ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తున్నా..ట్రంప్ కూడా భారీ మెజారిటీలో కొనసాగుతున్నారు. ఈ ఏడు రాష్ట్రాల్లోనూ నాలుగు చోట్ల హిల్లరీ ఆధిక్యంలో ఉండగా మూడు రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది. .నార్త్ కరొలినా - నెవడా - కొలరాడో - అయోవా రాష్ట్రాల్లో హిల్లరీ ముందున్నారు. అరిజోనా - ఫ్లోరిడా - ఓహియా రాష్ట్రాల్లో ట్రంప్ హవా కనిపించింది.
ఫ్లోరిడాలో 16.95 లక్షల ఆధిక్యంలో ట్రంప్ ఉన్నారు. అయోవాలో హిల్లరీ 41వేల ఓట్ల లీడ్ లో ఉండగా పూర్తిగా మెయిల్ ద్వారానే ఎన్నికలు జరిగే కొలరాడోలో డెమొక్రాట్లు 18,500 ఓట్ల ఆధిక్యం లేదా 1.5 శాతం ముందున్నారు. నెవడాలో కూడా 29వేల ఓట్ల ఆధిక్యంలో హిల్లరీ ఉన్నారు. ఆమెకు ఉత్తర కరొలినాలో 2.43 లక్షల ఆధిక్యం లభించింది.
ఓహియోలో ఈ వారం మొదట్లో ట్రంప్ ఆధిక్యం కనిపించింనా - తర్వాత డెమొక్రాట్లు 5 శాతం ముందంజలో ఉన్నారు. ముందస్తు పోలింగ్ లో పాల్గొనాల్సిందిగా తమ మద్దతుదారులను హిల్లరీ క్లింటన్ - డోనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ప్రోత్సహిస్తున్నారు. అయితే, ఈ నెల 8న జరిగే అసలు ఎన్నికల్లో నే గెలుపు ఎవరిదో తేలిపోనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/