Begin typing your search above and press return to search.

మోడీ..ట్రంప్ సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో ఏముంది?

By:  Tupaki Desk   |   27 Jun 2017 5:13 AM GMT
మోడీ..ట్రంప్ సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో ఏముంది?
X
ఆస‌క్తిగా ఎదురుచూసిన మోడీ.. ట్రంప్ ల భేటీ పూర్తి అయ్యింది. ఇరువురు నేత‌లు 20 నిమిషాల పాటు ఏకాంత భేటీ అనంత‌రం స‌హృద్భావ వాతావ‌ర‌ణంలో ఇరువురు సంయుక్త ప్ర‌క‌ట‌న చేశారు. ఇందులో భాగంగా తొలుత అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ త‌న ప్ర‌క‌ట‌న‌ను చ‌దివి వినిపించారు. అమెరికా అధ్య‌క్షుడి ప్ర‌క‌ట‌న‌లో ఏముందంటే..

+ ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశ ప్ర‌ధాన‌మంత్రిని వైట్ హౌస్ లోకి ఆహ్వానించ‌టం నాకు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నా. అమెరికా.. భార‌త‌దేశాల రాజ్యాంగాలు రెండు 'We The People' అనే మూడు ప‌దాల‌తో ప్రారంభ‌మ‌వుతాయి. ప్ర‌ధాని మోడీకి.. నాకూ ఈ మూడు ప‌దాలు ఎంత ముఖ్య‌మైన‌వో తెలుసు. ఈ స‌మావేశం త‌ర్వాత ఒక్క‌టి స్ప‌ష్టంగా చెప్ప‌గ‌ల‌ను.. భార‌త్‌.. అమెరికాల మ‌ధ్య అనుబంధం ఇంకెప్పుడు ఇంత బ‌లంగా ఉండ‌బోద‌ని.

+ మోడీ.. నేను సోష‌ల్ మీడియాలో ప్ర‌పంచ నాయ‌కులం. మోడీకి నేను సెల్యూట్ చేస్తున్నా. మీకు నేను సెల్యూట్ చేయ‌టానికి లెక్క‌లేన‌న్ని కార‌ణాలు ఉన్నాయి. అందులో భార‌త్ ప్ర‌పంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కావ‌టం ఒక‌టి. మ‌రో రెండు వారాల్లో భార‌త‌దేశం జీఎస్టీ ప్రారంభించ‌బోతున్నారు. మేం కూడా త్వ‌ర‌లో జీఎస్టీని అమ‌లు చేస్తాం. అవినీతిపై మీరు పోరాడుతున్నారు. ఓ అభివృద్ధి చెందుతున్న దేశానికి అవినీతి అనేది పెద్ద ప్ర‌తిబంధ‌కం.

+ వ్యాపారాల‌ను మ‌రింత ప్రోత్స‌హించేందుకు ఉన్న కొన్ని అడ్డంకుల్ని తొల‌గిస్తే బాగుంటుంది. దీనికి త‌గిన విధంగా రియాక్ట్ అవుతార‌ని ఆశిస్తున్నా. ఆర్థిక‌రంగంలో స‌హ‌కారాన్ని మ‌రింత పెంచేందుకు మోడీ.. నా కుమార్తె ఇవాంకాను భార‌త్‌ కు ఆహ్వానించారు.

+ ఉగ్ర‌వాదం విష‌యంలో ఇరు దేశాలు దెబ్బ తిన్నాయి. అప్ఘ‌నిస్తాన్ లో బ‌ల‌గాలు ఉండేందుకు స‌హ‌క‌రిస్తున్న భార‌తీయుల‌కు ధ‌న్య‌వాదాలు. ఉత్త‌ర కొరియా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు సృష్టిస్తోంది. ఆదేశ కార్య‌క‌లాపాల‌పై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంది. అమెరికాకు విచ్చేసి మా అతిథ్యం స్వీక‌రించినందుకు మోడీ మీకు థ్యాంక్స్‌. భార‌త్‌.. అమెరికాలు ఎల్ల‌ప్పుడు ఒక‌రినొక‌రు గౌర‌వించుకుంటాయి.

ట్రంప్ ప్ర‌క‌ట‌న అనంత‌రం మోడీ త‌న ప్ర‌క‌ట‌న‌ను చ‌దివి వినిపించారు. ఆయ‌న ప్ర‌క‌ట‌న‌ను చూస్తే..

= ట్వీట్ల నుంచి మాట‌ల వ‌ర‌కూ ట్రంప్ తో నా స‌మ‌యం స్నేహ‌పూర్వ‌కంగా గ‌డిచింది. వైట్ హౌస్ లో నాకు ల‌భించిన ఘ‌న‌స్వాగ‌తానికి అభినంద‌న‌లు. భార‌త్ గురించి మీరు చేసిన వ్యాఖ్య‌ల‌కు ధ‌న్య‌వాదాలు. ఈ రోజు మీరు చాలా స‌మ‌యాన్ని వెచ్చించారు. మ‌న మ‌ధ్య సాగిన సంభాష‌ణ‌లు భార‌త్‌.. అమెరికాల మ‌ధ్య సంబంధాల్లో కీల‌కం అవుతాయి.

= ఆర్థికరంగం విష‌యంలో భార‌త్‌.. అమెరికాల‌కు సారూప్య‌త ఉంది. ఆర్థిక ప‌రిపుష్టి కోసం ఇరుదేశాలు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. ఉగ్ర‌వాదం లాంటి అంశాల్లో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిద్దాం. భార‌త్.. అమెరికాల మ‌ధ్య ఉన్న అన్ని సంబంధాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపాం. ఉత్ప‌త్తిని పెంచ‌టం.. అభివృద్ధి.. ఉద్యోగాల క‌ల్ప‌న‌.. సాంకేతిక‌త‌ను కొత్త పుంత‌లు తొక్కించ‌టంపై ఒక‌రికొక‌రం సాయం చేసుకుంటాం. నా విజ‌న్ న్యూ ఇండియాకు.. ట్రంప్ విజ‌న్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లు విడివిడిగా కంటే కూడా క‌లివిడిగా సాగితే విజ‌యం సాధిస్తాయ‌ని నాకు అనిపిస్తోంది. పెట్టుబ‌డుల‌పై కూడా చ‌ర్చించాం. డిజిట‌ల్ రంగంలో కూడా భాగ‌స్వామ్యాన్ని బ‌ల‌ప‌ర్చుకుంటాం.

= ఉగ్ర‌వాదాన్ని అణిచేందుకు దాన్ని పెంచి పోషిస్తున్న దేశాల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌టంపై మా నిర్ణ‌యం ఆధార‌ప‌డి ఉంది. ఇండో ప‌సిఫిక్ రీజియ‌న్లో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను నెల‌కొల్ప‌టం ఇరు దేశాల ల‌క్ష్యం. నావికాద‌ళం ప‌రంగా అందించుకునే సాయాన్ని మ‌రింత పెంచాల‌ని నిర్ణ‌యించాం. ర‌క్ష‌ణ‌కు సంబంధించిన టెక్నాల‌జీ.. ట్రేడ్‌.. త‌యారీల‌పై ఇరు దేశాలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల‌ని నిర్ణ‌యించాం. మీ సార‌థ్యంలో ఇరుదేశాల సంబంధాలు కొత్త ఎత్తుకు చేరుతాయ‌ని ఆశిస్తున్నాం. మీకు నేను కీల‌క భాగ‌స్వామిని కాగ‌ల‌ను. మీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో మీరు భార‌త్ రావాల‌ని ఆశిస్తున్నా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/