Begin typing your search above and press return to search.
ట్రంప్ మీద ఒబామాకు నమ్మకం వచ్చేసింది
By: Tupaki Desk | 11 Nov 2016 9:34 AM GMTమనం చూసే కోణానికి తగ్గట్లే మనకు కనిపిస్తుంటాయని ఊరికే చెప్పరేమో. తాజాగా అదెంత నిజమన్నది అందరికి అర్థమయ్యే ఘటన ఒకటి చోటు చేసుకుంది. నిన్నటి వరకూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేయటమే కాదు.. ట్రంప్ లాంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అయితే.. అగ్రరాజ్యం ఏమైపోవాలన్న ఆందోళన వ్యక్తం చేసిన ఒబామా స్వరం ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత.. తాజాగా అమెరికా అధ్యక్షుడు ఒబామాతో ట్రంప్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వారు ఇరువురి మధ్య చాలా అంశాల మీద చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ సమావేశం తర్వాత ట్రంప్ మీద ఒబామా సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని.. నమ్మకాన్ని వ్యక్తం చేయటం విశేషంగా చెప్పాలి. ఎన్నికల పోలింగ్ కు ఒక్కరోజు ముందు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన ఒబామా.. తన మాట కోసమైనా అమెరికా ప్రజలు ట్రంప్ కు ఓటు వేయొద్దని కోరారు. ట్రంప్ తీరును తీవ్రంగా వ్యతిరేకించే ఒబామా.. తాజా భేటీ తర్వాత ఆయన తీరును ప్రశంసించటమే కాదు.. ఆయనపై నమ్మకం వచ్చేసినట్లుగా మాట్లాడటం గమనార్హం.
వీరిద్దరి మధ్య భేటీ దాదాపుగా 90 నిమిషాలు జరిగింది. ఈ సందర్భంగా తన ఆలోచనల్ని ఒబామాకు వివరించిన తర్వాత ట్రంప్ మీద ఎలాంటి కంగారు లేకుండా.. నిశ్చింతగా అధ్యక్ష బాధ్యతలు అప్పగించొచ్చన్న అభిప్రాయానికి ఒబామా వచ్చినట్లుగా వైట్ హౌస్ మీడియా కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ పేర్కొన్నారు. ఈ సమావేవంలో విదేశాంగ విధానంతో పాటు.. కొన్ని దేశాలతోతమకున్న ఇబ్బందులు.. విభేదాలు.. ఒప్పందాలు తదితర అంశాలపై ట్రంప్ నకు వివరించినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. వైట్ హైస్ లో జరిగే కార్యకలాపాల గురించి కూడా ట్రంప్ కు ఒబామా వివరించినట్లుగా తెలుస్తోంది.
ఈ భేటీ అనంతరం ట్రంప్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ప్రశంసలతో ముంచెత్తిన ఆయన.. తాను ఊహించిన దాని కంటే ఒబామాకు గొప్ప అనుభవం ఉందని పొగిడేశారు. ఒబామా సతీమణి మిషెల్లీ.. తన భార్య మిలినియాకు బాగా నచ్చేసినట్లుగా పేర్కొన్నారు. నిన్నటి వరకూ వైరిపక్షంగా భావించి ఒబామాను చూసిన ట్రంప్ కు ఆయనలోని లోపాలు మాత్రమే కనిపించాయి. తాజాగా.. ఒబామా తర్వాత తానే అమెరికా అధ్యక్షుడిని అన్నది నిజమయ్యాక.. తన ముందు అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తిని పొగిడేయటం ద్వారా ట్రంప్ తనను వ్యతిరేకిస్తున్న వారి మనసుల్ని దోచుకున్నారని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/