Begin typing your search above and press return to search.

ట్రంప్, ఒబామా ఒప్పుకొంటున్న త‌ప్పు ఇదే!

By:  Tupaki Desk   |   17 Dec 2016 5:30 PM GMT
ట్రంప్, ఒబామా ఒప్పుకొంటున్న త‌ప్పు ఇదే!
X
అమెరికాకు సంబంధించిన విష‌యాల్లో ఎడ్డెం అంటే తెడ్డెం అనే ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా - కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఒకే విష‌యంపై సేమ్ ఫీలింగ్ వ్య‌క్తం చేస్తున్నారు. పైగా వారిద్ద‌రూ ప‌శ్చాత్తాప దోర‌ణితో వారిద్ద‌రు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇదంతా ఒక‌ప్పుడు త‌మ‌కు పంటికింద రాయిలాగా మారిన ఇరాక్ విష‌యంలో.! ఇరాక్‌ పాలకుడు సద్దాం హుస్సేన్‌ ను విచారించిన అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ మాజీ అధికారి జాన్‌ నిక్సన్ రాసిన పుస్త‌కంలో అనేక ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ఈ నెలలో విడుద‌ల కానున్న జాన్‌ నిక్సన్ పుస్త‌కంలోని పలు వివరాలను టైమ్‌ మ్యాగజీన్‌ వెల్లడించింది. దీని ప్ర‌కారం ఇరాక్‌ లో అమెరికా చేసిన యుద్ధం - ఆ తర్వాత నెలకొన్న గందరగోళ పరిస్థితులే మధ్య ప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి కారణంగా మారింద‌ని ఇటు బ‌రాక్ ఒబామా - అటు ట్రంప్ క‌ల‌త చెందుతున్న‌ట్లు నిక్సన్ పేర్కొన్నారు. 2003లో ఇరాక్‌ పై అమెరికా దండెత్తడం వ‌ల్ల జాతుల సంఘర్షణకు దారితీసి ఇరాక్‌-సిరియాలను వెంటాడుతున్నాయ‌ని వారు భావిస్తున్నార‌ని వెల్ల‌డించారు. కాగా యుద్ధంతో ప‌ద‌వి కోల్పోయిన స‌ద్దాంను త‌ను విచార‌ణ చేసిన‌పుడు ఆయ‌న ఇరాక్ ను అమెరిక‌న్లు ప‌రిపాల‌న చేయ‌లేర‌ని జోస్యం చెప్పార‌ని అనంత‌రం కాలంలో అది నిజ‌మైంద‌ని నిక్స‌న్‌ విశ్లేషించారు. ఇరాక్ లో ఉన్న షియా-సున్నీ మ‌త‌స్థుల మ‌ధ్య ఉన్న విప‌రీత‌మైన అంత‌రాల‌ వ‌ల్ల ఈ ప‌రిస్థితి ఎదురైంద‌ని పేర్కొన్నారు. అనంత‌రం అదే రీతిలో ప‌రిపాల‌న ప్ర‌హ‌సనం కొన‌సాగి ఐసిస్‌ కు జీవం పోసిందని నిక్స‌న్ విశ్లేషించారు.

ఇరాక్ లో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితులు స‌ద్దాం ఉంటే కొన‌సాగ‌క‌పోయేవ‌ని జాన్ నిక్స‌న్ విశ్లేషించారు. స‌ద్దాం హుస్సేన్‌ లో క్రూరత్వం - త‌న మాటే నెగ్గాల‌నే భావ‌న ఉండ‌టం ప్ర‌పంచానికి లోపంగా భావించిన‌ప్ప‌టికీ... అలాంటి ల‌క్ష‌ణాల వ‌ల్లే ఆయ‌న విజ‌యం సాధించార‌ని ప్ర‌శంసించారు. బ‌య‌టి ప్ర‌పంచానికి లోపాలుగా క‌నిపించిన ఆ విధానాలే..విశాల‌మైన ఇరాక్‌ ను విజ‌యవంతంగా న‌డిపేందుకు ప‌నికి వ‌చ్చాయ‌ని నిక్స‌న్ వెల్ల‌డించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/