Begin typing your search above and press return to search.
ట్రంప్ సంచలన భేటీల్లో ఇది రెండవది
By: Tupaki Desk | 16 July 2018 3:13 PM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యమైన పరిణామాల పరంపరను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గండరగండడనే పేరున్న కిమ్ జోంగ్ ఉన్ తో సమావేశం అయి తను ఎంత దూకుడుగా ఉంటానో..అంతే సంయమనంగా వ్యవహరిస్తారనే సందేశాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వినూత్న ఒరవడికి కొనసాగింపుగా...తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఫిన్లాండ్ లోని హెల్సింకిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018 ఫిఫా వరల్డ్ కప్ ను విజయవంతంగా నిర్వహించినందుకు పుతిన్ ను ట్రంప్ అభినందించారు. అంతకుముందు రష్యాతో సంబంధాలు అధ్వానంగా ఉండటానికి అమెరికా పిచ్చితనం - మూర్ఖత్వమే కారణమని ట్రంప్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీకి కొద్ది గంటల ముందే ఆయన ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
పుతిన్ తో భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ఇక తమ చారిత్రక భేటీలో ఏయే అంశాలపై మాట్లాడతామో ట్రంప్ వివరించారు. వాణిజ్యం - మిలిటరీ - మిస్సైల్స్ - అణ్వాయుధాలు - చైనా.. ఇలా అన్నింటి గురించి మాట్లాడతామని స్పష్టంచేశారు. అమెరికా - రష్యా సంబంధాలపై కూడా స్పందించారు. కొన్నాళ్లుగా రెండు దేశాల మధ్య అంత మంచి సంబంధాలు లేవని ట్రంప్ అన్నారు. `ఈ మధ్యే నేను రష్యా వచ్చాను. ఇప్పుడు పుతిన్ తో మాట్లాడబోతున్నాను. రెండు దేశాలు సత్సంబంధాలు పెంపొందుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచమంతా అమెరికా - రష్యాలు కలిసి నడవాలని భావిస్తున్నాయి. ప్రపంచంలో ఈ రెండు దేశాలే అతిపెద్ద అణు శక్తి కేంద్రాలు. 90 శాతం అణ్వాయుధాలు మా దగ్గరే ఉన్నాయి. నిజానికి ఇది మంచి విషయం కాదు. చాలా చెడ్డ విషయం` అని ట్రంప్ అన్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై పుతిన్ తో మాట్లాడతారా లేదా అన్న అంశంపై ట్రంప్ స్పందించలేదు.