Begin typing your search above and press return to search.
క్యూబాతో కెలుక్కొని ట్రంప్ అమెరికాకు దెబ్బేశాడట
By: Tupaki Desk | 18 Jun 2017 7:34 AM GMTఅమెరికా తాజా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న కీలక నిర్ణయాలు తిరగదోడటం, రద్దు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్యూబాపై ప్రయాణ, వాణిజ్య ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ ట్రంప్ తీసుకున్న తాజా చర్యల వల్ల ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలు దెబ్బతింటాయని, పైగా ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకూ ఎదురు దెబ్బేనని విశ్లేషకులు, పరిశీలకులు, నిపుణులు పేర్కొంటున్నారు. ఒబామా ప్రభుత్వం అనుమతించిన వ్యక్తిగత ప్రయాణాలను ట్రంప్ సర్కార్ నిషేధించింది. పరిమితి గల బృందాలతో మాత్రమే అమెరికన్లు క్యూబాలో పర్యటించవచ్చు. అలాగే క్యూబా మిలటరీకి చెందిన వ్యాపార సంస్థలతో అమెరికా కంపెనీలు కానీ, వ్యక్తులు కానీ వాణిజ్యం చేయడం నిషేధించబడింది.
క్యూబాపై దశాబ్దాలుగా అమల్లో ఉంటున్న ఆర్థిక ఆంక్షలు ఇప్పుడూ ఉంటాయని ట్రంప్ పునరుద్ఘాటించారు. దీనిపై క్యూబా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గత రెండేళ్ల కాలంలో సాధించిన పురోగతి అంతా ట్రంప్ ప్రకటనతో తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించింది. 2014 డిసెంబరు 17న ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పుకోవాలని, దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని రౌల్ కాస్ట్రో, బరాక్ ఒబామా నిర్ణయించారు. బలవంతంగా రుద్దుతారా లేక ఒత్తిడి తీసుకురావడం ద్వారా అమలు చేస్తారా అనే దానితో నిమిత్తం లేకుండా క్యూబాలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థను మార్చడానికి ఉద్దేశించిన ఏ వ్యూహమైనా సరే విఫలమై తీరుతుందని క్యూబా ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. క్యూబా పట్ల అమెరికా అనుసరిస్తున్న ఈ విధానం ''చారిత్రక తిరోగమనం'' అని క్యూబన్లు వ్యాఖ్యానిస్తున్నారు. క్యూబా ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే కీలకమని, తాజాగా ట్రంప్ చర్యలతో క్యూబా ఆర్థికంగా దెబ్బతింటుందని హవానా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎస్తేబెన్ మోరేల్స్ వ్యాఖ్యానించారు. క్యూబాలో అమెరికా పెట్టుబడులను నిషేధించడం వల్ల అటు అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని అన్నారు. అయితే పరస్పర ప్రయోజనాలు కలిగిన అంశాలపై అమెరికాతో చర్చలకు తాము సుముఖంగానే వున్నామని క్యూబా సర్కార్ ప్రకటించింది. మెక్సికోతో కఠినమైన సరిహద్దు నియంత్రణలు, క్యూబాతో వాణిజ్యంపై కఠోర ఆంక్షలు చూస్తుంటే లాటిన్ అమెరికాను అమెరికాకు 'బ్యాక్‌యార్డ్' గా కాకుండా ఒక భారంగా ట్రంప్ పరిగణిస్తున్నట్లు అర్ధమవుతోందని చైనా సామాజిక శాస్త్రాల అకాడమీలోని అమెరికా అధ్యయన సంస్థ పరిశోధకుడు డయావో డామింగ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ తీసుకున్న ఈ విధాన మార్పు వల్ల తాత్కాలికంగా తన ఓటర్లను సంతృప్తిపరిచినప్పటికీ దీర్ఘకాలంలో జాతీయ ప్రయోజనాలకు ఆచరణాత్మక ఇబ్బందులు ఎదురవుతాయని లాటిన్ అమెరికా అధ్యయన సంస్థలో పరిశోధకుడు వాంగ్ పెంగ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు క్యూబాపై విధించిన తాజా ఆంక్షలు అమెరికాలో కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాయి. మన రైతులకు క్యూబా సహజ మార్కెట్ అని కన్సాస్ రిపబ్లిక్ సెనెటర్ జెర్రీ మోరాన్ పేర్కొన్నారు. ట్రంప్ చర్యలతో క్యూబాకు రైతుల ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోతాయని తద్వారా రైతులు ఇబ్బందులు పడతారని విమర్శించారు. క్యూబాకు ప్రయాణించే అమెరికన్ల స్వేచ్ఛకు, అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఈ చర్యలు ఎదురు దెబ్బ అని వెర్మాంట్ సెనెటర్ పాట్రిక్ లెహే విమర్శించారు. ఎక్కడకు వెళ్ళాలనుకుంటే అక్కడకు వెళ్ళగలిగే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అమెరికన్లకు ఉండాలని ఫ్లోరిడా ప్రతినిధి కేథే కేస్టర్ అన్నారు. ఇదొక భయంకరమైన నిర్ణయమని కాలిఫోర్నియా కాంగ్రెస్ సభ్యురాలు బార్బారా లీ తన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. సంబంధాల పునరుద్ధరణకు చాలా కష్టపడ్డాం, ఇన్నాళ్ళుగా సాధించిన ప్రగతి అంతా ఒక్కసారిగా నిర్వీర్యమై పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/