Begin typing your search above and press return to search.
ట్రంప్ నోట క్షమించు అనే మాట!
By: Tupaki Desk | 8 Oct 2016 7:34 AM GMTనిత్యం దూకుడు - వెనకా ముందూ చూసుకోకుండానే మాట్లాడుతుంటాడా అనే అనుమానం కలిగే స్థాయిలో ప్రత్యర్థులపై ఫైర్. శ్వేతసౌధంలో అగ్రరాజ్యాన్ని ఏలాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి మరీ ఈ స్థాయిలో మాట్లాడతాడా అనే సాందేహాలు... అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాలకు ముందు బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ట్రంప్... ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రపంచం మొత్తం కేవలం ఆయన నోటి దురుసుతో ప్రాచుర్యం సంపాదించుకున్నారనే చెప్పొచ్చు. ఈ క్రమంలో తాజాగా ట్రెండ్ మార్చారో లేక వ్యూహంలో భాగమో కానీ ట్రంప్ నోట ఉన్నట్లుండి "క్షమించండి" అనే మాట వచ్చింది!
వినడానికి కాస్త ఆశ్చర్యంగా - ఇంకాస్త అనుమానంగా అనిపిస్తున్నా... ఇది నిజం!! ప్రచారంలో అత్యంత దుందుడుగా వ్యహరించే డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా దూకుడు తగ్గించి కాస్త మెత్తగా మాట్లాడుటమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పారు. 2005లో ఒక వివాహితపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపడంతో వెంటనే ఆయన దిద్దుబాటు చర్యలకు దిగినట్లున్నారు. ఇందులో భాగంగా ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు ట్రంప్. తప్పులు చేయకుండా ఉండటానికి తానేమీ మానవాతీతుడిని కాదని అన్న ట్రంప్... తన మాటలుగా ప్రచారంలో ఉన్న ఆ వీడియో దాదాపు పదేళ్ల క్రితం నాటిదని, తనతో సన్నిహితంగా ఉండేవారికి తానెలాంటి వ్యక్తినో బాగా తెలుసని అన్నారు. కానీ ఈ విషయంలో జరిగినదానికి మాత్రం పూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని ట్రంప్ తెలిపారు.
కాగా, 2005 సంవత్సరంలో ట్రంప్ ఒక మహిళ గురించి దారుణంగా కామెంట్ చేసిన వీడియో ఒకటి తాజాగా బయటపడింది. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక దాదాపు 11 ఏళ్ల క్రితం నాటి ఆ వీడియోను సంపాదించింది. ఆయన ఓ వివాహితను సెక్సుకు ప్రోత్సహించేలా మాట్లాడినట్లు ఆ వీడియోలో స్పష్టమవుతోంది. ఆమె శరీర అవయవాలను వర్ణిస్తూ ట్రంప్ కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలను ముద్దుపెట్టుకోవడం - అసభ్యంగా తాకడం - వాళ్లతో లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ మైక్రోఫోన్ లో రికార్డయ్యాయి. వాటికి సంబందించి ట్రంప్ తాజాగా క్షమాపణలు కోరారు!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/