Begin typing your search above and press return to search.
చైనాకు మండేలా ట్రంప్ తాజా నిర్ణయం
By: Tupaki Desk | 22 Dec 2016 5:30 PM GMTమొండికి జగమొండే కరెక్ట్. ఈ విషయంలో మరో మాటకు అవకాశం లేదు. తాజాగా చైనాకు.. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ కు మధ్య నడుస్తున్న అప్రకటిత వార్ లో భాగంగా తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుచున్న నాటి నుంచి డ్రాగన్ మీద తీవ్రంగా విరుచుకుపడే ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన తర్వాత కూడా తన కోపాన్ని.. ఆగ్రహాన్ని ఏ మాత్రం తగ్గించుకోలేదు.
చైనా అంటేనే ఇంతెత్తున విరుచుకుపడే ట్రంప్.. తాజాగా ఆ దేశానికి మండిపోయే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తన మాదిరే చైనాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆ దేశం అమలు చేసే ఆర్థిక విధానాలను వ్యతిరేకించే ఆర్థిక వేత్త పీటర్ నెవారోను తన ఆర్థికసలహాదారుగా ట్రంప్ ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ నెవారో గురించి కాస్తంత ప్రత్యేకంగా చెప్పాలి.
చైనాతో అమెరికాకు ప్రమాదం పొంచి ఉందని.. ఆసియాలో చైనా అతి పెద్ద ఆర్థిక శక్తిగా.. సైనికశక్తిగా ఎదగాలని భావిస్తుందని.. ఇలాంటి వైఖరి కారణంగా చైనాతో అమెరికాకు ముప్పు ఉందన్నది నెవారో విశ్లేషణ. ఇదిలా ఉంటే.. ఆర్థిక విధానాల్లో ట్రంప్ కు సలహాదారుగా ఎన్నికైన నెవారో మంచి దార్శనికుడని.. దేశ వ్యాపార.. వాణిజ్యాలను క్షీణించకుండా.. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందేలా.. ఉపాధి అవకాశాలు విదేశాలకు తరలిపోకుండా ఉండేలా ఆర్థిక విధానాల్ని నెవారో చేస్తారన్న ఆశాభావాన్ని ట్రంప్ టీమ్ వ్యక్తం చేసింది.
నెవారో విషయానికి వస్తే.. చైనాకు వ్యతిరేకంగా పుస్తకాలు రాయటంతో పాటు.. ఏకంగా ఒక సినిమాను కూడా తీయటం విశేషం. 67 ఏళ్ల నెవారో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ కు కీలక సలహాదారుగా వ్యవహరించారు. ఆయన రాసిన పుస్తకాల్లో ‘‘డెత్ బై చైనా’’.. హౌ అమెరికా లాస్ట్ ఇట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ బేస్’’ లాంటి పుస్తకాల్ని డాక్యుమెంటరీ ఫిలింగా రూపొందించారు. చైనాతో జరిగే ఆర్థిక యుద్ధంలో అమెరికా ఓడిపోతుందని.. దీంతో చైనా దిగుమతుల కారణంగా అమెరికాలో పర్యావరణ సమస్యలే కాదు.. మేధో సంపత్తి విషయంలోనూ అమెరికా అధిపత్యం తగ్గుతుందన్నది నెవారో ఆందోళన. మరి.. అలాంటి వ్యక్తి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి ఆర్థిక సలహాదారుగా మారటంతో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/