Begin typing your search above and press return to search.
ట్రంప్ లో ఇప్పుడు కొత్త కోణం చూడవచ్చు
By: Tupaki Desk | 7 Aug 2017 7:05 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మామూలుగానే చిలిపి, తుంటరి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సందర్భం ఏదైనా తనదైన శైలిలో కొంటె పనులు చేస్తుండే ట్రంప్‌ను ఇప్పుడు కొత్త కోణంలో చూడవచ్చంటున్నారు. ఎందుకంటే..అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతర్గతంగానూ, బహిర్గతంకానూ సమస్యలు, సవాళ్లతో సతమతమైన ఎట్టకేలకు 17 రోజుల వ్యాహ్యాళికి వెళ్లారు. సెంట్రల్ న్యూజెర్సీలోని తన సొంత గోల్ఫ్ క్లబ్ లో ట్రంప్ విశ్రాంతి తిసుకుంటారు. భార్య - పిల్లలు - అల్లుల్లు - తన వ్యాపారంలోని కీలక ఉద్యోగులతో ట్రంప్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ఈ వెకేషన్ సందర్భంగా గోల్ప్ ఆడటం మొదలుకొని తన క్లబ్ లోని మొక్కల పనులు చూసుకోవడం వరకు ఈ 17 రోజులు ట్రంప్ జల్సాగా గడిపేస్తారని చెప్తున్నారు. ట్రంప్ వెంట ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ - అల్లుడు ఖుష్నర్ - కొందరు సహాయకులు ఉన్నారు. అయితే, ఆయన వ్యాహ్యాళిలో ఉన్నప్పటికీ పాలనా వ్యవహారాలకు సంబంధించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని సూచనలు చేస్తారని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. అత్యవసర అంశాలపై ఆయన సమీక్షలు కొనసాగుతాయని ఆయన వివరించారు.
కాగా, జాలీ ట్రిప్ కు వెళ్లేముందు సైతం ట్రంప్ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఉత్తర కొరియాను దౌత్యపరంగా ఎదుర్కొని దాన్నుంచి తలెత్తే అణు ముప్పును నిరోధించేందుకు రష్యా - చైనాతో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉత్తర కొరియాపై ఆర్థిక ఆంక్షలను విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ రెండు దేశాలు సమర్థించడాన్ని ఆయన హర్షించారు. ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఖండాంతర క్షిపణి పరీక్షలను నిర్వహిస్తున్న ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తూ ఐరాస తీసుకున్న నిర్ణయాన్ని రష్యా - చైనాలు బలపరచడం సానుకూల పరిణామంగా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉత్తర కొరియాను పూర్తిగా దారికి తెచ్చేందుకు ఈ రెండు దేశాలతోపాటు ఇతర మిత్రదేశాలతోనూ క్రియాశీలకంగా పనిచేయడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని కూడా ఆ ప్రకటనలో తెలిపింది. ఏకగ్రీవంగా ఐరాస ఆమోదించిన ఈ ఆంక్షల తీర్మానానికి అనుకూలంగా పదిహేను ఓట్లు వచ్చాయి. రష్యా - చైనాలు కూడా బలపరచడంతో దీని ఏకగ్రీవ ఆమోదం సాధ్యమైంది. ఈ ఓటింగ్ కు ముందే ఉత్తర కొరియా నాయకత్వంతో మాట్లాడిన ఐరాస రష్యా రాయబారి అణు క్షిపణి కార్యక్రమాలను రద్దుచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఉత్తర కొరియాపై తలపెట్టిన ఈ రకమైన తీర్మానాలను రష్యా - చైనాలు అడ్డుకున్న నేపథ్యంలో ఈ రెండు దేశాలనుంచే తాజాగా సానుకూల పరిణామాలు రావడం అంతర్జాతీయ శాంతికి శుభసూచకంగా భావిస్తున్నారు. తాజా ఆంక్షలవల్ల ఉత్తర కొరియా వార్షిక ఎగుమతుల ఆదాయం దాదాపు మూడు బిలియన్ల మేర తగ్గిపోతుంది.