Begin typing your search above and press return to search.

ఆమెకూ ట్రంప్ ప్ర‌పోజ్ చేశాడ‌ట‌

By:  Tupaki Desk   |   5 Oct 2017 7:44 AM GMT
ఆమెకూ ట్రంప్ ప్ర‌పోజ్ చేశాడ‌ట‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పుకోవాలే చాలానే ఉంద‌ని చెప్పాలి. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు.. నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టానికి కేరాఫ్ అడ్ర‌స్ గా చెప్పాలి. ఆడోళ్ల‌ను చుల‌క‌న‌గా చూడ‌ట‌మే కాదు.. వారిని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా నోరు పారేసుకోవ‌టం ట్రంప్ కు అల‌వాటే. అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన సంద‌ర్భంగా మ‌హిళ‌ల్ని ఆయ‌న ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు చాలానే ర‌చ్చ జ‌రిగింది.

మ‌హిళ‌లంటే ఇంత చుల‌క‌న ఉన్న ట్రంప్‌ను అమెరిక‌న్లు అధ్య‌క్షుడిగా అంగీక‌రిస్తారా? అన్న సందేహం పెద్ద ఎత్తున నెల‌కొంది. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న అధ్య‌క్షుడిగా ఎన్నిక కావ‌టం తెలిసిందే. ట్రంప్ లోని పారిశ్రామికవేత్త కోణంతో పాటు.. రొమాంటిక్ కోణం ఉంది. అంద‌మైన సెల‌బ్రిటీ అంటే చాలు అదే ప‌నిగా మ‌న‌సు పారేసుకునే ఆయ‌న‌.. గ‌తంలో చాలామంది హాలీవుడ్ భామ‌ల‌కు ప్ర‌పోజ్ చేశాడు.

ఆ మాట‌కు వ‌స్తే హాలీవుడ్ భామ‌ల‌కే కాదు.. ప్రిన్స్ డ‌యానాకు సైతం ప్ర‌పోజ్ చేయాల‌నుకున్న‌ట్లుగా చెబుతారు. అంద‌మైన భామ‌లంటే ప‌డి చ‌చ్చే ట్రంప్‌.. ప‌లువురికి ప్ర‌పోజ్ చేసి.. వారి చేత రిజెక్ట్ కావ‌టం ఈ మ‌ధ్య‌న ప‌లుమార్లు బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా మ‌రో హాలీవుడ్ న‌టి సైతం ట్రంప్ ను తాను రిజెక్ట్ చేసిన విష‌యాన్నిచెప్పుకొచ్చారు.

హాలీవుడ్ అందాల భామ‌గా.. ప్ర‌పంచ శృంగార పిపాస‌కుల‌కు దేవ‌త‌గా భావించే బ్రూక్ షీల్డ్స్ కు ట్రంప్ ప్ర‌పోజ్ చేశాడ‌ట‌. ఆ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. ట్రంప్ రెండో భార్య మార్లా మేపుల్స్ తో విడాకులు తీసుకున్న వెంట‌నే.. ట్రంప్ త‌న‌కు ఫోన్ చేశార‌న్నారు.

ట్రంప్ ఫోన్ చేసిన స‌మ‌యానికి తాను ఒక సినిమా షూటింగ్ లో ఉన్నాన‌ని వెల్ల‌డించారు. రెండో భార్య నుంచి విడాకులు తీసుకున్నంత‌నే ఫోన్ చేసి.. ‘నువ్వు అమెరికన్ల హృదయసామ్రాజ్ఞివి.. నేను అమెరికాలోనే అత్యంత ధనవంతుడ్ని. మనిద్దరం కలిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది" అని ప్ర‌పోజ్ చేసిన‌ట్లుగా వెల్ల‌డించారు. అయితే.. త‌న‌కు అప్ప‌టికే బాయ్ ఫ్రెండ్ ఉండ‌టంతో తాను రిజెక్ట్ చేశాన‌న్నారు. ట్రంప్ ను తిర‌స్క‌రించిన హాలీవుడ్ భామ‌ల్లో ఇప్ప‌టివ‌ర‌కూ స‌ల్మా హ‌య‌క్‌.. కేండిస్ బెర్లెన్‌.. ఎమ్మా థాంప్స‌న్ లు ఉన్నారు. తాజాగా బ్రూక్ షీల్డ్స్ మాట‌ల‌తో రిజెక్ట్ చేసినోళ్ల జాబితాలో ఆమె పేరు కూడా చేరిన‌ట్టైంది.