Begin typing your search above and press return to search.

ట్రంప్ ఖాతాలో మరో చెత్త రికార్డు

By:  Tupaki Desk   |   5 Feb 2017 7:59 AM GMT
ట్రంప్ ఖాతాలో మరో చెత్త రికార్డు
X
అహంభావం.. మొండితనం.. అంతకు మించిన మూర్ఖత్వం.. తన మాట మాత్రమే నెగ్గాలన్న వైఖరి.. ఇలా దరిద్రపు గుణాలన్ని పోతపోసినట్లుగా ట్రంప్ లో కనిపిస్తాయి. ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. ఈ ప్రపంచం ఏమైపోయినా ఫర్లేదు.. తన మాట మాత్రమే నెగ్గాలన్న ఆలోచన నిండిపోయిన ట్రంప్.. ఎంతటి వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే ఆయన పేరిట చెత్త రికార్డులు బోలెడన్ని ఉన్నాయి.

తాజాగా ఆయన ఖాతాలో అలాంటి చెత్త రికార్డు మరొకటి నమోదైంది. అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంపై ఫెడరల్ కోర్టు తాత్కాలిక ఆదేశాల్ని జారీ చేసిన తర్వాత.. వాటిపై తొందరపడి వ్యాఖ్యలు చేయరు. కానీ.. ట్రంప్ అందుకు భిన్నం. ఏడు ముస్లిం దేశాల ప్రజలు అమెరికాలోకి అనుమతించకుండా జారీ చేసిన బ్యాన్ ఆదేశాల్ని సియాటెల్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

అయితే.. దీనిపై మండిపడిన ట్రంప్.. అందుకు చెక్ పెట్టే అవకాశాల్ని అన్వేషించటం మొదలెట్టారు. పెడరల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో ఏడు ముస్లిం దేశాలకు చెందినవారు అమెరికాలోకి అడుగుపెట్టేందుకు విపరీతంగా ప్రయత్నిస్తుండటం గమనార్హం. లండన్.. పారిస్ నుంచి అమెరికాకువచ్చేందుకు వీసున్న వారంతా అర్జెంట్ గా అమెరికాకు వెళ్లే ప్రయత్నాలు షురూ చేశారు.

ఇదిలా ఉంటే.. ఫెడరల్ కోర్టు ఆదేశాల అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ట్రంప్.. తాజాగా మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని సవాల్ చేసి.. వెనువెంటనే నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా ట్రంప్ సర్కారు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన ఆదేశాలపై తాత్కాలికంగా స్టే ఇచ్చిన న్యాయమూర్తిపై ట్విట్టర్ వేదికగా చేసుకని ఊహించనిరీతిలో వ్యాఖ్యలుచేశారు. న్యాయమూర్తి నిర్ణయాన్ని ‘‘పిచ్చి నిర్ణయం’’గా అభివర్ణించటం గమనార్హం. ఇలా ఒక ఫెడరల్ జడ్జిపై అమెరికా అధ్యక్షుడు ఈ తరహాలో వ్యాఖ్యలు చేయటం అమెరికాలో ఇదే తొలిసారని చెబుతున్నారు. ఇప్పటికే పలు చెత్త రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్న ట్రంప్.. తాజాగా న్యాయమూర్తిపై చేసిన అనుచిత వ్యాఖ్యతో మరో చెత్త రికార్డును తన ఖాతాలోవేసుకున్నారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/