Begin typing your search above and press return to search.
ట్రంప్ పై మిలటరీ అటాక్..!
By: Tupaki Desk | 3 Aug 2016 6:34 AM GMTఅమెరికా అధ్యక్ష పదవి రేసులో ట్రంప్ కాస్త వెనుకబడినట్లుగా కనిపిస్తోంది. ప్రవాసులు - ముస్లిం పై దాడితో చాలా మంది అమెరికన్లలో హీరోగా మారిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ... ఒక్కసారిగా విలన్ గా మారిపోయాడు. అందుకు కారణం.. ఓ ముస్లిం దంపతులపై ట్రంప్ చేసిన విమర్శలు. ఆ ముస్లిం వ్యక్తి పేరు కైజర్ ఖాన్. అమెరికా వారం రోజులుగా ఏ టీవీ చూసిన ఖాన్ దంపతులు ఫోటోలే. అనేక పత్రికలు షారుక్ ఖాన్ సినిమా మై నేమ్ ఈజ్ ఖాన్ లోని డైలాగ్ మై నేమ్ ఈజ్ ఖాన్ .. అయామ్ నాట్ ఎ టెర్రరిస్ట్ ను ఉపయెగించుకుంటూ మైనేమ్ ఈజ్ ఖాన్ అయుమ్ ఎ పేట్రియాటిక్ క్యాప్షన్ తో వార్తలు ఇస్తున్నాయి.
ఒక ముస్లిమ్ దంపతులపై ట్రంప్ చేసిన వ్యాఖ్యాలు అమెరికా అంతటా కలకలం రేపాయి. సొంత రిపబ్లికన్ పార్టీ సెనేటర్లే ట్రంప్ ను విమర్శిస్తూ అధికారిక ప్రకటనలు ఇస్తున్నారు. దేశంలోని మాజీ సైనికులు - అధికారులకు సంబంధించిన 30 కి పైగా సంఘాలు ట్రంప్ ను విమర్శిస్తూ ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. ఇంకా అనేక సంఘాలు ఇంకా స్పందిస్తూనే ఉన్నాయి. దేశ చరిత్రలో ఇలా మాజీ సైనికుడు ఒక్కటిగా స్పందించడం మొదటిసారి. ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చిన స్ధిరపడినవారిని - ముఖ్యంగా ముస్లిములపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యాలపై ఓ ముస్లిం దంపతులు డెమెక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ (ఎన్ డీసీ) లో మాట్లాడారు. అతని పేరు కైజర్ ఖాన్ ఆయన భార్య పేరు గజాలా ఖాన్. పాకిస్తాన్ కు చెందిన వీరు 1980లోనే అమెరికాకు వచ్చి స్ధిరపడ్డారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడికి ముందే వీరి కుమారుడు హుమాయూన్ ఖాన్ సైన్యంలో చేరాడు. అమెరికా ఆర్మీ కెప్టెన్ హోదాకు ఎదిగాడు. ఇరాక్ లో విధి నిర్వహణలో ఉండగా.. తామున్న ఆఫీసులోకి అనుమానాప్పద వ్యక్తి చొరబడంతో వెంటనే అతన్ని అడ్డుకున్నాడు. అగంతకుడు తనకు తాను పేల్చుకోవడంతో హుమాయూన్ ఖాన్ కేడా మరణించారు. తరవాత దర్యాప్తు లో తేలిదేమిటంటే.. అమెరికా మిలటరీ క్యాంప్ ను ధ్వంసం చేసేందుకు అగంతకుడు 200పౌన్ల మందుగుండుతో చొరబడే ప్రయత్నం చేశాడని. తన వీరోచిత పోరాటంతో క్యాంపులో తోటి సైనికులను కాపాడాడని అమెరికా హుమయూన్ కు మరణాంతర అవార్డులతో సత్కరించింది.
ఎన్ డీసీలో మాట్లాడిన కైజర్ ఖాన్ ట్రంప్ ను నేరుగా ఉద్దేశిస్తూ మాట్లాడారు. అమెరికా రాజ్యాంగం మీరు చదివారా అంటూ .. అర్లాంగ్టన్ సిమెట్రీని మీరు ఎపుడైనా సందర్శించారా ? అమెరికాను కాపాడుతూ వేల మంది అమర వీరులు సమాధులను మీరు చూశారా? అక్కడికెళ్ళి చూడండి.. అన్ని మతస్తులు కన్పిస్తారు. మహిళలు - పురుషులు కన్పిస్తారు. మీరు ఎలాంటి త్యాగం చేయలేదంటూ ప్రశ్నించారు. కైజర్ మాట్లాడుతున్నపుడు కైజర్ భార్య గజాలా పక్కనే ఉన్నారు. ప్రజలందరూ ఆయన ప్రసంగం విన్నారు. అయితే.. ఆయన ప్రసంగంపై ట్రంప్ స్పందించడంతో అసలు గొడవ మొందలైంది. ‘‘నేను చాలా త్యాగాలు చేశాను. ఎన్నో వ్యాపారాలు చేసి లాభాలు గడించాను పన్నులు కట్టాను. వేల మందికి ఉపాధి కల్పించానని అంటూనే ఇదంతా హిల్లరా కుట్ర ’’ అని ట్రంప్ ఆరోపించారు. కైజర్ స్పీచ్ ను హిల్లరీ మనుషులు రాశారంటూ ఆరోపించారు.
ట్రంప్ వ్యాఖ్యాలతో ఒక్కపారి అమెరికాలో గందరగోళం మొదలైంది. దేశంలోని మాజీ సైనిక అధికారులు - అమర వీరుల బంధువులు తీవ్రస్ధాయిలో స్పంధించారు. నీ వ్యాపార లాభాలతో - ఉపాధి అవకాశాలతో మా పిల్లల త్యాగాలను పోల్చుతావా అంటూ నిలదీశారు. ఎన్ డీసీ లో మాట్లాడకపోయినా కైజర్ భార్య గజాలా ఖాన్ ఆ తరువాత వాషింగ్టన్ పోస్ట్ వంటి పత్రికల్లో స్పంధించారు. కొడుకును పోగొట్టుకుని తాను ఎంతటి నరకం అనుభవించిందో వివరించారు. దాదాపు దేశంలోని అన్ని మీడియా సంస్ధలు గజాలా ఖాన్ స్పందనను ప్రచురించాయి. మాజీ సైనికులందరూ ఆమె వెంట నిలబడ్డారు. ఇన్నాళ్ళూ రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ సైనికులు రాజకీయ నేతలు దృష్టిలో మా త్యాగాల విలువ ఇదా - అంటూ నిలదీయడం ప్రారంభించారు. అమరవీరుల కుటుంబాలు గజాలాకు మద్ధతుగా నిలదీస్తూనే ట్రంప్ పై విరుచుకుపడ్డారు. దీంతో రిపబ్లికన్ పార్టీ సెనేట్ అభ్యర్ధులు జరగబోయే ప్రమాదం గ్రహించి ట్రంప్ వ్యాఖ్యాలను ఖండిస్తూ ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. మొత్తానికి ట్రంపు కంపుకంపయ్యారు.