Begin typing your search above and press return to search.
ఛా....ట్రంప్ ను అపార్థం చేసుకున్నాం
By: Tupaki Desk | 10 Feb 2017 8:18 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశారు. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వివిధ దేశాల అధిపతులతో మాట్లాడుతున్న క్రమంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో తొలిసారి ఫోన్ లో మాట్లాడిన సందర్భంగా ఆ దేశంతో సత్సంబంధాలు నెలకొనేలా వివిధ వివాదాస్పద అంశాలపై ఆచితూచి స్పందించారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత వన్ చైనా పాలసీపై స్పందించిన తీరు చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తైవాన్ అధ్యక్షురాలితో ఫోన్లో మాట్లాడటం, ఎన్నో ఏళ్లుగా అమెరికా గౌరవిస్తూ వస్తున్న వన్ చైనా పాలసీని ట్రంప్ ప్రశ్నించడంపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అయితే జిన్ పింగ్ తో ఫోన్లో మాట్లాడిన సందర్భంగా తాను వన్ చైనా పాలసీని గౌరవిస్తానని ట్రంప్ చెప్పడం గమనార్హం. తద్వారా చైనాతో వివాదాలు సద్దుమణిగే ప్రయత్నం చేశారు
వన్ చైనా పాలసీని గౌరవించాలన్న చైనా అధ్యక్షుడి వినతి మేరకు ఆ పాలసీని తాము గౌరవిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారని వైట్ హౌజ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు ఇద్దరు అధ్యక్షులు తమ దేశానికి రావాల్సిందిగా ఒకరినొకరు ఆహ్వానించుకున్నారు. కాగా, వన్ చైనా పాలసీని ట్రంప్ గౌరవించడంపై జిన్ పింగ్ హర్షం వ్యక్తంచేశారు. వన్ చైనా పాలసీ అనేది చైనా - అమెరికా మధ్య ఓ రాజకీయ పునాదిలాంటిదని చైనా అధికార చానెల్ సీసీటీవీ అభిప్రాయపడింది. తొలిసారి ఫోన్ సంభాషణ సత్ఫలితాలు ఇవ్వడంతో భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపాలని రెండు దేశాల అధినేతలు నిర్ణయించినట్లు వైట్‌హౌజ్ వెల్లడించింది. ఫోన్ సంభాషణకు ముందే తనకు శుభాకాంక్షలు చెబుతూ చైనా అధ్యక్షుడు పంపిన లేఖకు ట్రంప్ ప్రత్యుత్తరాన్ని పంపినట్లు వైట్ హౌజ్ తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/